నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్ ముందంజ ..? ఈ సారి పక్కానట..!.. అందుకే అన్నిట్లో వేలు..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి రేసులో ముందంజలో ఉన్నారట. అమెరికాకు చెందిన ఓ పత్రిక నుంచి కథనం వెలువడింది. నోబెల్ శాంతి బహుమతి గెలుచుకునేందుకు ట్రంప్ ముందు వరుసలో ఉన్నారని.. రోజురోజుకూ ఆయనకు ఉన్న అవకాశాలు మెరుగవుతున్నాయని ఆ కథనం పేర్కొంది. ఈ వార్తతో రిపబ్లికన్ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. తమ అధినాయకుడికి ఈ సారి నోబెల్ పీస్ ప్రైజ్ పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మార్చి 5న నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ 338 అభ్యర్థులను ఈ ఏడాది నామినేట్ చేసింది. వీరిలో 244 మంది స్వతంత్రులు కాగా 94 సంస్థలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నామినేటెడ్ అభ్యర్థులు పెరిగినట్లు కమిటీ తెలిపింది. 2024లో 286 మందిని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు స్పష్టం చేసింది.

ఇక అమెరికా చరిత్రలో ఇప్పటివరకు నలుగురు అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించారు. థియోడర్ రోస్ వెల్ట్(1906), వుడ్ రో విల్ సన్(1919), జిమ్మీ కార్టర్(2002), చివరగా బరాక్ ఒబామా(2009) ఉన్నారు. ఈ క్రమంలో ఈ అవార్డును ఎలాగైనా సాధించి వీళ్ల సరసన చేరాలని ట్రంప్ తెగ ఉవ్విళ్లూరుతున్నారట. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సమస్యలపై పెద్దన్న పాత్ర వహిస్తున్నారని పరిష్కారం చూపిస్తూన్నారని ఈ ప్రత్యేక వార్తా కథనం పేర్కొంది.

గతంలోనూ డొనాల్డ్ ట్రంప్ చాలాసార్లు నోబెల్ పీస్ ప్రైజ్ కు నామినేట్ అయ్యారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ అవార్డు చేజారిపోయింది. అయితే ఈ సారి ప్రెసిడెంట్ ట్రంప్ ముందు వరుసలో ఉన్నారట. వికీ లీక్స్ ఫౌండర్ జులియన్ అసాంజే, రష్యా ప్రతిపక్షనేత దివంగత అలెక్సీ నావెల్సీ భార్య యూలియా నావల్నయాల కంటే ట్రంప్ ముందు వరుసలో ఉన్నట్లు ఈ కథనం పేర్కొంది.

Trump Emerges as Frontrunner for Nobel Peace Prize

గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య శాంతి చర్చలు, రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు.. పలు సంస్థలకు దాతృత్వ సేవలు.. తదితర కార్యక్రమాలతో ఆయన ముందంజలోకి దూసుకొచ్చారని తెలుస్తోంది. ఇక నోబెల్ ప్రైజ్ విజేతలను అక్టోబర్ 10 న ప్రకటిస్తారు. డిసెంబర్ 10న నార్వేలోని ఓస్లో నగరంలో అందజేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+