డొనాల్డ్ ట్రంప్ సడన్ భారీ షాక్: వీసా, ఇమ్మిగ్రేషన్ రద్దు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంలో కఠిన మార్పులను ప్రకటించారు. దేశీయ వ్యవస్థలను పునర్నిర్మించడం, అనధికార వలసలను అరికట్టడం, విదేశీయులపై నిఘాను కఠినతరం చేయడం వంటి విస్తృత లక్ష్యాలలో భాగంగా ఈ నిర్ణయాలను తీసుకున్నారు. 'మూడవ ప్రపంచ దేశాల' నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేయడానికి కృషి చేస్తానని తెలిపారు. వాషింగ్టన్ డీసీలో వైట్‌హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డులపై ఆఫ్ఘన్ జాతీయుడి కాల్పుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయంలో ఆయన మరో అడుగు ముందుకేశారు. 30 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో ప్రవేశించే విదేశీ పౌరులపై ప్రయాణ నిషేధాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి జాబితాను త్వరలో జాబితాను ప్రకటిస్తామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి క్రిస్టీ నోమ్ తెలిపారు. ప్రస్తుతం 19 దేశాలపై ప్రయాణ నిషేధం కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలో మరో 30 దేశాలు చేరనున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ పౌరుల ప్రవేశాన్ని పూర్తిగా పరిమితం చేయడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్‌మెనిస్తాన్, వెనిజులా పౌరుల ప్రవేశాన్ని పాక్షికంగా పరిమితం చేశారు.
దీన్ని మరింత విస్తరించాలని గతంలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. దీనికి అనుగుణంగా తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి కూడా. మరిన్ని దేశాలు ఈ జాబితాలో చేరాయి. కొత్తగా చేరిన వాటిల్లో బుర్కినా ఫాసో, మాలి, నైగర్, దక్షిణ సూడాన్, సిరియా ఉన్నాయి. ఆయా దేశాలకు చెందిన పౌరులెవరూ కూడా అమెరికాకు రాలేరు. వారికి చెందిన ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులు, వీసాల ప్రక్రియను తక్షణమే నిలిపివేశారు.
పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ట్రావెల్ డాక్యుమెంట్లు ఉన్న వారికి కూడా పూర్తి ఆంక్షలు వర్తింపజేశారు. వీటితో పాటు మరో 15 దేశాలను పాక్షిక ఆంక్షల జాబితాలోకి చేర్చింది అమెరికా. నైజీరియా, టాంజానియా, సెనెగల్ వంటి దేశాల నుండి వచ్చే ప్రయాణికులు ఇప్పుడు మరింత కఠినమైన తనిఖీలను ఎదుర్కొంటారు. కొన్ని ప్రత్యేక వీసా వర్గాలపై పరిమితులను కూడా విధించనున్నారు.












Click it and Unblock the Notifications