Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకం: ట్రంప్‌ సంచలనం

ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ ఎనర్జీ హబ్‌ పై అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్తంగా దాడులు చేపట్టాయి. ఇరాన్‌ లో చమురు సరఫరాకు క్రియాశీలకంగా ఉన్న ఖర్గ్‌ ఐలాండ్‌ టార్గెట్ ‌గా దాడులు జరుగుతున్నాయి. డెడ్‌ లైన్‌ కు ముందే అమెరికా- ఇజ్రాయెల్‌ బలాగాలు దాడులు చేసిన నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. మరోవైపు తాజాగా ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ కు ఇచ్చిన గడువు మరో రెండు గంటల్లో ముగియనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకం అని తెలిపారు. ఇరాన్‌ ను ఒక్కరాత్రిలో తుడిచిపెట్టడం నిజానికి తనకు ఇష్టం లేదని.. కానీ ఆ పని చేయక తప్పకపోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రజలను దేవుడు దీవించాలని అన్నారు. అలాగే ఇరాన్‌లో 47 ఏళ్ల అవినీతి, అరాచకం పాలన అంతంకానుందని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ లో ఇరాన్‌ లో కొత్త నాయకత్వం వచ్చిందని.. ఈ నాయకత్వం వల్ల అద్భుతాలు జరగవచ్చని ట్రంప్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక అంతకుముందు ఏప్రిల్ 6 న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హార్మూజ్ జలసంధిపై తాను ఇచ్చిన డెడ్ లైన్ కు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకే ఇరాన్ కు డెడ్ లైన్ విధించినట్లు.. అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఇరాన్ మొత్తాన్ని ఒక్క రాత్రిలోనే తూడ్చిపెట్టేస్తామని సంచలన వార్నింగ్ ఇచ్చారు. అది ఏప్రిల్7 మంగళవారం రాత్రి కావొచ్చని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దాంతో ట్రంప్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Trump Makes Sensational Move as Iran-US War Looms A Pivotal Night in World History Trump Iran move

మరోవైపు ఇరాన్ ప్రజలు రైలు ప్రయాణాలు మానుకోవాలని ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు ఇరాన్ లోని ప్రజలు ఎవరూ రైళ్లను ఉపయోగించవద్దని అంతేకాకుండా రైల్వే లైన్ల సమీపానికి కూడా ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించింది ఇజ్రాయెల్. దాంతో అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై భీకర దాడులు చేసే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+