గ్రీన్ కార్డుల పునఃసమీక్ష- బాంబు పేల్చిన ట్రంప్

వాషింగ్టన్ డీసీలో కాల్పులు ఉదంతం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మకంగా మారిన దేశాలకు బిగ్ షాక్ ఇచ్చారు. ఆయా దేశాల వారికి మంజూరు చేసినగ్రీన్ కార్డులన్నింటినీ కూడా పునః పరిశీలించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. గ్రీన్ కార్డులను పునఃసమీక్షించాల్సిన బాధ్యతను యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కి అప్పగించారు.

వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డులపై ఆఫ్ఘనిస్తాన్ జాతీయుడు కాల్పులు జరిపిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాలను తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైట్ హౌస్ నుంచి ఉత్తర్వులు వెలువడిన వెంటనే.. ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. గ్రీన్ కార్డుల జారీ, తనిఖీ ప్రక్రియను మరింత కఠినతరం చేసింది. తనిఖీ ప్రక్రియ అత్యంత కఠినంగా ఉంటుందని ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో స్పష్టం చేశారు.

Trump Order to Green Card Review for These 19 Countries Immediately

సమస్యాత్మకంగా మారిన ప్రతి దేశ పౌరుడికీ జారీ అయిన గ్రీన్ కార్డును సమగ్రంగా, కఠినంగా పునః సమీక్షిస్తామని జోసెఫ్ ఎడ్లో తెలిపారు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కింద ఆమోదం పొందిన అన్ని అసైలమ్ కేసులను కూడా పరిశీలిస్తామని అన్నారు. సమస్యాత్మక దేశాల నుంచి వచ్చిన అసైలమ్ దరఖాస్తులను పరిశీలించడంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విఫలమైందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ అన్నారు.

ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఇచ్చిన ఈ మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. నవంబర్ 27వ తేదీ.. అంటే కాల్పులు జరిగిన రోజున లేదా ఆ తర్వాత పెండింగ్‌లో ఉన్న లేదా దాఖలు అయిన అన్ని గ్రీన్ కార్డు దారఖాస్తులకు ఇవి వర్తిస్తాయి. అలాగే అప్పటివరకు దాఖలైన వీసాలన్నింటినీ కూడా రద్దు చేసేలా తదుపరి చర్యలు ఉంటాయని జోసెఫ్ ఎడ్లో పేర్కొన్నారు.

ఈ జాబితాలో..

ఆఫ్ఘనిస్తాన్

బర్మా

చాద్

రిపబ్లిక్ ఆఫ్ కాంగో

ఈక్వటోరియల్ గినియా

ఎరిట్రియా

హైతీ

ఇరాన్

లిబియా

సోమాలియా

సూడాన్

యెమెన్

బురుండి

క్యూబా

లావోస్

సియెర్రా లియోన్

టోగో

తుర్క్‌మెనిస్తాన్,

వెనిజులా.. ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+