Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్ పై అమెరికన్ ఆర్మీ తిరుగుబాటు..?.. రోడ్లపైకి లక్షల మంది నిరసన కారులు.. ఏం జరుగుతోంది..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్, అమెరికా ఫస్ట్ నినాదాలతో ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మొన్నటి వరకూ అగ్రరాజ్యంలోని వలసవాదులను తిరిగి స్వస్థలాలకు పంపించారు. అనేక దేశాలపై టారిఫ్ లు పెంచారు. ట్రంప్ వైఖరితో అమెరికాలో పర్యాటకం తగ్గిపోయింది. అమెరికా లో ఉపాధి, ఉద్యోగాల కోసం వచ్చే యువత తగ్గిపోయింది. ఈ క్రమంలో అమెరికాలోనే ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు పుట్టుకొచ్చాయి.

Trump s 250th Army Parade A Patriotic Triumph or Social Media Flop

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనకారులు లక్షలాది మంది రోడ్డెక్కారు. నో కింగ్స్ పేరుతో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ప్రజలు నినాదాలు చేస్తూ ఆందోళనలు చేపట్టారు. దీంతో నిరసన కారులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని.. వలసదారుల హక్కులకు రక్షణ కలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అట్టుడుకిపోతోంది.

ఓవైపు అమెరికాలో నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 250వ ఆర్మీ పరేడ్ లో పాల్గొన్నారు. అయితే ఈ పరేడ్ అట్టర్ ప్లాఫ్ గా నిలిచినట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అమెరికా ఆర్మీ సైనికులు అనాసక్తితో ఈ పరేడ్ లో పాల్గొన్నట్లు వీడియోల్లో స్పష్టంగా అర్థం అవుతోంది. అమెరికాలో జరుగుతున్న 250 వ మిలిటరీ పరేడ్ కావాడం విశేషం. కానీ ఇంతటి ప్రతిష్టాత్మక రోజున ఎలాంటి ఉత్సాహం, జోష్ లేకుండానే ఆర్మీ పరేడ్ నీరసంగా సాగినట్లు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ నడుస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ పై అమెరికన్ ఆర్మీ కోపంతో ఉందని.. అందుకే పరేడ్ లో ఉత్సాహం, జోష్ లేకుండా సాగిందని పలువురు నెటిజెన్లు సామాజిక మాధ్యమాల ద్వారా కామెంట్స్ పెడుతున్నారు.

అమెరికాలో జరిగిన 250 వ ఆర్మీ పరేడ్ లో ఎలాంటి విన్యాసాలు, అద్భుత ప్రదర్శన లేకుండా సైనికులు సాధారణంగా నడుచుకుంటూ వస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పరేడ్ ను చైనాతో పాటు ఇతర దేశాల ఆర్మీ పరేడ్ తో పోలుస్తూ నెటిజెన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+