అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్ కు బిగ్ విక్టరీ.. ఇకపై మరిన్ని ఆంక్షలు..?
అమెరికాలోని సుప్రీంకోర్టులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ విజయం లభించింది. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన పలు పాలసీలు, నిర్ణయాలను అమెరికాలోని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాలు ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్రాల్లోని న్యాయ స్థానాలను ఆశ్రయించగా.. అక్కడి జడ్జీలు ట్రంప్ పాలసీలపై స్టే విధించారు. అయితే ఈ విషయంపై ట్రంప్ సుప్రీకోర్టును ఆశ్రయించగా ఆయనకు భారీ ఊరట లభించింది.
అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ తీసుకుంటున్న పలు నిర్ణయాలకు వివిధ రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు స్టే విధిస్తున్న క్రమంలో అమెరికాలోని సుప్రీంకోర్టులో ట్రంప్ కు భారీ ఊరట లభించింది. ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలను అడ్డుకునే అధికారం రాష్ట్రాల్లోని న్యాయస్థానాలకు లేదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 6:3 పద్ధతిలో ఈ తీర్పును వెల్లడించింది అమెరికాలోని అత్యున్నత న్యాయస్థానం.
అమెరికాలోని చట్టాల ప్రకారం ఆ దేశంలోని పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా.. అక్కడ జన్మించిన ప్రతి ఒక్కరికీ అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఈ దేశానికి పౌరులే అనే ఉద్దేశంతో 1868లో ఓ చట్టం తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం.. శరణార్థుల పిల్లలకూ అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక ఈ విధానాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఈ ఆదేశాలపై అమెరికాలోని పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు స్టే విధించాయి. వీటిని వ్యతిరేకిస్తూ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ట్రంప్ వాదనను ఏకీభవించింది. దీంతో ట్రంప్ కు భారీ విజయం దక్కినట్లుగా భావించవచ్చు. అమెరికా సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ట్రంప్ మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికాలో సెటిల్ అయిన వాళ్ల పిల్లలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
Supreme Court hands Trump explosive win, slashes Judges’ power to block his Agenda https://t.co/K9wQLEq2DB
— P.M. NEWS (@pmnewsnigeria) June 27, 2025
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక వలసదారులు, శరణార్థులపై కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఏకీభవించిన నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించేందుకు ట్రంప్ సిద్ధం అవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications