ట్రంప్ అన్నంత పనీ చేశాడు బాబోయ్..!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక అనేక దేశాలపై టారిఫ్ లు విధిస్తూ వచ్చారు. అలాగే అక్రమ వలసదారులను అమెరికా నుంచి వెనక్కు పంపించారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA)లో భాగంగా పలు కఠిన చర్యలు తీసుకున్నారు ట్రంప్. అయితే తాజాగా మరోసారి ప్రపంచ దేశాలకు టారిఫ్ వార్నింగ్ పంపించారు ట్రంప్. గ్రీన్ లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
గ్రీన్ లాండ్ వ్యవహారంలో మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇటీవల వెనిజులాను తన అధీనంలోకి తీసుకున్న ట్రంప్.. తాజాగా గ్రీన్ లాండ్ ను కూడా కంట్రోల్ లోకి తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇందుకు వ్యతిరేకించిన డెన్మార్క్, యూకే, ఫ్రాన్స్ దేశాలపై 10 శాతం టారిఫ్ లు విధించారు ట్రంప్. ఇక అమెరికా జాతీయ భద్రత కోసం గ్రీన్ లాండ్ చాలా కీలకమని.. అయితే సులువుగా.. కాకపోతే కఠిన పద్ధతిలోనైనా దానిని స్వాధీనం చేసుకోవడం తప్పనిసరి అని ట్రంప్ స్పష్టం చేశారు.

ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ లాండ్ ఆక్రమణను వ్యతిరేకించిన డెన్మార్క్, యూకే, ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలపై టారిఫ్ లను విధించినట్లు ప్రకటించారు. అమెరికా గ్రీన్ లాండ్ ఆక్రమణను వ్యతిరేకిస్తున్న ఈ దేశాలపై 10 శాతం టారిఫ్ లను విధిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. పెంచిన టారిఫ్ లు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నట్లు ట్రూత్ సోషల్ లో శనివారం పోస్ట్ చేశారు. ఈ దేశాలు అమెరికాతో డీల్ కుదుర్చుకోకుంటే జూన్ 1 నుంచి 25 శాతానికి టారిఫ్ లు పెంచుతున్నట్లు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications