ట్రంప్‌కు గట్టి షాక్: ట్రావెల్ బ్యాన్ రాజ్యాంగ విరుద్దమన్న కోర్టు!..

ట్రంప్ ఆర్డర్ ను నిలిపివేస్తున్నట్లు ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ప్రకటించింది. మరోవైపు ట్రంప్ మాత్రం ట్రావెల్ బ్యాన్ పై తన ప్రయత్నాలు కొనసాగించనున్నారు.

వాషింగ్టన్: ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన నిర్ణయంపై అక్కడి ఫెడరల్ కోర్టు ప్రతికూల తీర్పు వెలువరించింది. దీంతో ట్రంప్ ఏకపక్ష ధోరణికి గట్టి షాక్ తగిలినట్లయింది. పైకి జాతీయ భద్రత అని కారణాలు చెబుతున్నప్పటికీ.. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని తేల్చి చెప్పింది.

ట్రంప్ ట్రావెల్ బ్యాన్ నిర్ణయంలో అసహనం, వివక్ష, వ్యతిరేక ధోరణి వంటి అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని కోర్టు స్పష్టం చేసింది. అమెరికా సర్క్యూట్ అప్పిలేట్ లోని 4వ సర్క్యూట్ కోర్టు ఈ తీర్పు ప్రకటించింది. ట్రావెల్ బ్యాన్ లో భాగంగా.. ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ నుంచి ప్రజలకు వీసాలను నిషేధించడం.. రిపబ్లికన్ పరిపాలనకు విఘాతమని తెలిపింది.

Trump travel ban blocked; fight headed for Supreme Court

ట్రంప్ ఆర్డర్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ట్రంప్ మాత్రం ట్రావెల్ బ్యాన్ పై తన ప్రయత్నాలు కొనసాగించనున్నారు. ఫెడరల్ కోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయాలని ఆయన భావిస్తున్నారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ బ్యాన్ విధించారు.

దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అందులోంచి ఇరాక్ ను తప్పించారు. ఆపై మిగతా దేశాల వలసలపై నిషేధం కొనసాగేలా మరో ఆర్డర్ జారీ చేశారు. మే 16నుంచి ఈ ఆదేశాలు అమలులోకి రానుండగా.. ఫెడరల్ కోర్టు దానిపై స్టే విధించడంతో తర్వాతి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+