30 దేశాలకు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్.. !!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంలో కఠిన మార్పులను ప్రకటించారు. దేశీయ వ్యవస్థలను పునర్నిర్మించడం, అనధికార వలసలను అరికట్టడం, విదేశీయులపై నిఘాను కఠినతరం చేయడం వంటి విస్తృత లక్ష్యాలలో భాగంగా ఈ నిర్ణయాలను తీసుకున్నారు. 'మూడవ ప్రపంచ దేశాల' నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేయడానికి కృషి చేస్తానని తెలిపారు. వాషింగ్టన్ డీసీలో వైట్‌హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డులపై ఆఫ్ఘన్ జాతీయుడి కాల్పుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయంలో ఆయన మరో అడుగు ముందుకేశారు. 30 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో ప్రవేశించే విదేశీ పౌరులపై ప్రయాణ నిషేధాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి జాబితాను త్వరలో జాబితాను ప్రకటిస్తామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి క్రిస్టీ నోమ్ తెలిపారు. ప్రస్తుతం 19 దేశాలపై ప్రయాణ నిషేధం కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలో మరో 30 దేశాలు చేరనున్నాయి.

డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశంలో నిషేధిత దేశాల గురించి వెల్లడించానని ఆమె చెప్పారు. వివిధ దేశాల నుంచి వచ్చిన హంతకులు, రక్తపిపాసులు, అర్హత లేనివారికి నిలయంగా అమెరికాను మార్చేస్తోన్నారని అన్నారు. అటువంటి పౌరులను అమెరికాకు పంపిస్తోన్న ప్రతి దేశంపైనా ట్రావెల్ బ్యాన్ విధించాలని డొనాల్డ్ ట్రంప్ కు సిఫార్సు చేశానని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి జాబితాను తయారు చేయాలని ఆయన ఆదేశించినట్లు వివరించారు.
తమ పూర్వీకులు రక్తం, చెమట, స్వేచ్ఛ పట్ల అచంచలమైన ప్రేమతో ఈ దేశాన్ని నిర్మించారని, ఇప్పుడు పరిస్థితులు తలకిందులు అయ్యాయని చెప్పారు. మన కష్టార్జిత పన్ను డాలర్లను లాక్కోవడానికి, అమెరికన్లకు దక్కాల్సిన ప్రయోజనాలను లాక్కోవడానికి విదేశీ దురాక్రమణదారులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తోన్నారని క్రిస్టీ నోమ్ పునరుద్ఘాటించారు. అలాంటి దేశాలకు చెందిన వాళ్లు ఒక్కరు కూడా తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు.
ఆఫ్ఘనిస్తాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ పౌరుల ప్రవేశాన్ని పూర్తిగా పరిమితం చేయడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్‌మెనిస్తాన్, వెనిజులా పౌరుల ప్రవేశాన్ని పాక్షికంగా పరిమితం చేశారు. దీన్ని మరింత విస్తరించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది.
-
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!!












Click it and Unblock the Notifications