వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ టేపుల్లో ఆమె ఉన్న విషయం తెలియదా? : ట్రంప్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : తొలి డిబేట్ లో హిల్లరీతో పోటీ పడలేకపోక వెనుకంజ వేసిన ట్రంప్.. ఆ తర్వాత ప్రత్యేక సలహాదారులను సైతం నియమించుకుని ఆచీ తూచి మాట్లాడాలని నిర్ణయించుకున్నా.. ఆయన నోటి దురుసుకు మాత్రం బ్రేక్ పడట్లేదు. గతంలో మిస్ వరల్డ్ ఎలీషియా మచాడోపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్న ట్రంప్.. ఇంత జరిగినా తన విమర్శలకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టలేదు.

తాజాగా ట్విట్టర్ ద్వారా మరోసారి తన నోటి దురుసును బయటపెట్టుకున్న ఆయన.. 'మిచాడోను తాను తిట్టానని అంతా అంటున్నారని, అయితే ఆమె ఓ సెక్స్ టేపులో ఉన్న విషయాన్ని కూడా విమర్శకులు పట్టించుకోవాలని' సూచించారు ట్రంప్. తెల్లవారు జామున 3.20గం.ల సమయంలో రిపబ్లికన్ అభ్యర్థి హిల్లరీని విమర్శిస్తూ వరుసపెట్టి పలు ట్వీట్స్ చేసిన ట్రంప్.. ఆ ట్విట్స్ లో మచాడో గురించి ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

కాగా, 1996లో మిస్ యూనివర్స్ గా నిలిచిన మచాడోను అప్పట్లో ట్రంప్ నానా దుర్భాషలాడిన విషయాన్ని మొన్నటి డిబేట్ సందర్బంగా ప్రస్తావించారు హిల్లరీ. మహిళలంటే ట్రంప్ కు ఏమాత్రం గౌరవం లేదని ఈ డిబేట్ లో ఆమె స్పష్టం చేశారు. మిస్ యూనివర్స్ గా నిలిచిన కొంతకాలానికి మచాడో కాస్త బరువు పెరగడంతో.. అప్పట్లో ఆమెను 'మిస్ పిగ్లీ (పంది), తిండిబోతు (ఈటింగ్ మెషీన్)' అంటూ నోటి దురుసును ప్రదర్శించారు ట్రంప్. ఇదే విషయాన్ని డిబేట్ లో ప్రస్తావిస్తూ మహిళల పట్ల ఆయన తీరును ఎండగట్టారు హిల్లరీ.

Trump tries to distract from Alicia Machado sex tape accusations

హిల్లరీ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ట్రంప్.. మిచాడో గతంలో ఓ సెక్స్ టేపులో కనిపించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మిచాడో గతం గురించి తెలుసుకోకుండా అనవసరంగా ఆమెను ఓ దేవతను చేయాలనుకుంటున్నారని విమర్శించారు ట్రంప్. అయితే టేపుల వివరాలపై మాత్రం ట్రంప్ స్పందించకపోవడం గమనార్హం.

ఫాక్స్ టీవి ఇంటర్వ్యూ సందర్బంగాను తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు ట్రంప్. మచాడో బరువు గురించి కామెంట్ చేస్తూ.. అది నిజంగా సమస్యేనని అన్నారు. ఇదంతా ఇలా ఉంటే.. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతోన్న మిచాడో గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్రంప్ తననో చెత్త కుప్పులాగా చూసేవాడని మండిపడ్డారు. 20ఏళ్ల తర్వాత మళ్లీ ఓ పీడకలలా తన గురించి ట్రంప్ మాట్లాడారాని ఆవేదన వ్యక్తం చేశారామె.

English summary
Donald Trump tried to distract voters from a weeklong controversy over his insults toward a former Miss Universe on Friday night by asking Barack Obama to pledge not to “pardon Hillary Clinton and her co conspirators for their many crimes against our country and against society itself”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X