ఆఫ్ఘనిస్తాన్ పై కన్నేసిన డొనాల్డ్ ట్రంప్: తాలిబన్లకు మూడినట్టే?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆఫ్ఘనిస్తాన్‌పై కన్నేశారు. అక్కడ అధికారంలో ఉన్న తాలిబన్ ప్రభుత్వంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై ఆరా తీస్తోన్నారు. అమెరికన్ సైన్యాన్ని ఉపసంహరించుకుంటోన్న తర్వాత అక్కడ నెలకొంటోన్న పరిస్థితులు, ఐసిస్- ఖొరాసన్ ప్రావిన్స్ కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా క్రమంగా పాగా వేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని డొనాల్డ్ ట్రంప్ తాజాగా కేంద్ర బిందువుగా చేసుకున్నారు. దీన్ని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీన్ని తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఏదీ సవ్యంగా సాగట్లేదనీ వ్యాఖ్యానించారు. మున్ముందు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చనీ పేర్కొన్నారు.

తన మొదటి పదవీకాలంలో అమెరికా సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉపసంహరించుకునే ఒప్పందాన్ని స్వయంగా పర్యవేక్షించానని డొనాల్డ్ ట్రంప్ గుర్తుచేశారు. బాగ్రామ్ ఎయిర్ బేస్ ను అమెరికాకు తిరిగి అప్పగించకపోతే కొన్ని తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని, దీన్ని ఎదుర్కొనడానికి తాలిబన్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉండాల్సొస్తుందని హెచ్చరించారు.
2020 ఫిబ్రవరిలో అమెరికా, తాలిబన్ మధ్య కుదిరిన దోహా ఒప్పందం.. ఆ మరుసటి సంవత్సరం అమెరికా దళాల ఉపసంహరణకు దారి తీసిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల పాటు అమెరికా- ఆఫ్ఘనిస్థాన్ మధ్య కొనసాగిన కన్ ఫ్లిక్ట్ కు ముగింపు పలకాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదిరింది. ఇందులో ఉగ్రవాద కార్యకలాపాలను వెంటనే నిలిపివేయడం, అంతర్గత చర్చలకు సంబంధించిన అంశాలు ఇందులో పొందుపరిచారు. బాగ్రామ్ వంటి స్థావరాలను అమెరికాకు తిరిగి ఇవ్వాలనే ప్రస్తావన ఇందులో లేదు.
బాగ్రామ్ ఎయిర్ బేస్ ను సోవియట్ యూనియన్ హయాంలో నిర్మించారు. 2001 తర్వాత దాన్ని అమెరికా హస్తగతం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికాకు ఉన్న అతిపెద్ద ఎయిర్ బేస్ స్టేషన్ ఇదే. దీన్ని కేంద్రబిందువుగా చేసుకునే గతంలో అక్కడ తన సైనిక కార్యకలాపాలను నిర్వహించిందా దేశం. వైమానిక కార్యకలాపాలు, విజిలెన్స్, లాజిస్టిక్స్‌కు ఇది కేంద్రంగా పనిచేసింది. కాబూల్‌కు సమీపంలో వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటం వల్ల దక్షిణ, మధ్య ఆసియాలో అమెరికాకు ఇదో ప్రధాన బేస్ స్టేషన్ గా గుర్తింపు పొందింది.
సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత.. దీన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీన్ని తిరిగి ఇవ్వాలని తాజాగా డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఇది క్రమంగా చైనా వశమౌతుందని, అదే జరిగిన తన పట్టు కోల్పోవాల్సి వస్తుందనే ఆందోళన డొనాల్డ్ ట్రంప్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
-
ఇరాన్ క్లోజ్.. హార్మూజ్ ఓపెన్.. చైనా హ్యాపీ: ట్రంప్ సంచలన ప్రకటన -
ప్రపంచానికి అద్భుతమైన రెండు రోజులు; యుద్దంపై ట్రంప్ సంచలన ప్రకటన! -
స్వయానా ట్రంప్ నోట -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!












Click it and Unblock the Notifications