ఇంకో బాదుడు బాదాడయ్యో- పైగా డెడ్ లైన్ కూడా పెట్టాడు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో బాదుడు బాదారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని మీడియం, హెవీ-డ్యూటీ ట్రక్కులపై 25 శాతం టారిఫ్ ను విధించారు. నవంబర్ 1వ తేదీ నుండి ఈ టారిఫ్ అమలులోకి రానుంది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. దీనివల్ల భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ట్రక్కులకు అదనంగా 25 శాతం టారిఫ్ ను చెల్లంచాల్సి ఉంటుంది.

నిజానికి- భారీ ట్రక్కుల దిగుమతులపై కొత్త టారిఫ్ అక్టోబర్ 1 నుండి అమలులోకి రావాల్సి ఉంది. అది అమలు కాలేదు. తాత్కాలికంగా నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా దీనికి తేదీని నిర్ధారించారు ట్రంప్. నవంబర్ 1వ తేదీ నుంచి ట్రక్కులపై టారిఫ్ అమలులోకి వస్తుందని వెల్లడించారు. దీనివల్ల ట్రక్కుల దిగుమతులు కొంతవరకు తగ్గుతాయిన, దేశీయంగా వాటి తయారీ ముమ్మరమౌతుందని ఆయన భావిస్తోన్నారు.

Trump s New 25 percent Tariff on Medium and Heavy-Duty Trucks from November

జాతీయ భద్రతకు కీలకమైనవిగా భావించే వస్తువులపై దిగుమతి పన్నులను విధించడానికి ప్రభుత్వానికి అధికారం కల్పించే ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్ సెక్షన్ 232 కింద డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 10,000 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న మీడియం, హెవీ-డ్యూటీ ట్రక్కులు, వాటి భాగాలపై దృష్టి సారించారు. విదేశీ సరఫరాదారుల వల్ల దేశీయంగా ట్రక్కుల తయారీ మందగించిందని భావిస్తోన్నారు. దీన్ని కట్టడి చేయాల్సి అవసరం ఉందని ట్రంప్ నిర్ణయించారు.

దీనివల్ల పీటర్‌బిల్ట్, కెన్‌వర్త్, ఫ్రైట్‌లైనర్, మాక్ ట్రక్స్ వంటి అమెరికన్ ట్రక్ తయారీదారులకు ఊతం ఇచ్చినట్టవుతుందని, దేశీయంగా ట్రక్కుల తయారీ మరింత పెరుగుతుందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంచనావేస్తోంది. ట్రక్కులను తమ దేశానికి ఎగుమతి చేయడం అనేది అన్యాయమని, దేశీయ ట్రక్ తయారీదారులను రక్షించడానికి, 25% టారిఫ్ విధించాల్సి వచ్చిందని పేర్కొంది. జాతీయ భద్రత ప్రయోజనాలతో పాటు ఈ పరిశ్రమను ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత తమపై ఉన్నట్లు వివరించింది.

జపాన్ , యూరోపియన్ యూనియన్‌ దేశాలతో ఇప్పటికే ఉన్న వాణిజ్య ఒప్పందాల ప్రకారం, తేలికపాటి వాహనాలపై 15 శాతం సుంకాలు విధించడానికి అమెరికా అంగీకరించింది. డెలివరీ వాహనాలు, చెత్తను తరలించే ట్రక్కులు, ప్రజల అవసరాల కోసం వినియోగించేవి, ట్రాన్సిట్ అండ్ షటిల్ బస్సులు, స్కూల్ బస్సులు, సెమీ-ట్రక్కులు, ఇతర హెవీ-డ్యూటీ వాహనాలకు వర్తిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+