ఇట్స్ ఓకే.. మమ్దానీ మాటలకేం గానీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. న్యూయార్క్ నగర మేయర్ గా ఎన్నికైన జొహ్రాన్ మమ్దానీతో సమావేశం అయ్యారు. వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో ఈ భేటీ ఏర్పాటైంది. 45 నిమిషాలు పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. అనంతరం ట్రంప్, మమ్దానీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

న్యూయార్క్ మేయర్ క్యాంపెయిన్ సమయంలో డొనాల్డ్ ట్రంప్, మమ్దానీ మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. ట్రంప్ ను ఓ ఫాసిస్ట్, నిరంకుశుడిగా సంబోధించారు మమ్దానీ. ఇదే విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. మమ్దానీ సరదాగా స్పందించారు. ట్రంప్‌ను ఉద్దేశించి ఫాసిస్ట్ అంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా అని విలేకరులు అడిగారు. దీనికి ఆయన బదులిచ్చారు. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చానని చెప్పారు.

Trump s Oval Office Meeting with Mamdani A Surprising Moment of Humor

మమ్దాని ఇంకా మాట్లాడుతుండగా.. ట్రంప్ జోక్యం చేసుకున్నారు. ఇట్స్ ఓకే.. అని మమ్దాని భుజం తట్టారు. తనను ఫాసిస్ట్ అని సంబోధించిన విషయాన్ని అంగకరించినందుకు అభినందిస్తున్నానని అన్నారు. ఇలా అంగీకరించడం.. అన్నింటికన్నా సులభం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ను నిరంకుశుడిగా అని సంబోధించిన విషయమై విలేకరులు ప్రశ్నించినప్పుడు కూడా మామ్దానీకి సపోర్ట్ గానే మాట్లాడారు ట్రంప్.

తనను నిరంకుశుడి కంటే దారుణమైన పదాలతో పిలిచారానే విషయం గుర్తుందని,అందుకే- ఆ పదం అంత అవమానకరమైనదిగా భావించట్లేదని ట్రంప్ బదులిచ్చారు. మేయర్ హోదాలో వైట్ హౌస్ తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ట్రంప్‌ను నిరంకుశుడిగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారా అని అడిగిన ప్రశ్నకు మమ్దాని సమాధానం ఇస్తూ తమ ఇద్దరి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాల లేవని, తమ స్థానాలేమిటో తమకు స్పష్టంగా తెలుసునని అన్నారు.

క్యాంపెయిన్ లో తాను చేసిన విమర్శలను డొనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం పట్టించుకోలేదని, వాటన్నింటినీ ఆయన తేలిగ్గా తీసుకున్నారని, అందుకే ట్రంప్ అంటే గౌరవం ఏర్పడిందని అన్నారు. విభేదాలపై కాకుండా.. న్యూయార్క్ ప్రజలకు సేవ చేయాలనేదే తమ ఉమ్మడి ఉద్దేశమని, ఈ భేటీలో వాటిపైనే మాట్లాడామని చెప్పారు.

వ్యయ సంక్షోభంతో పోరాడుతున్న ఎనిమిదిన్నర మిలియన్ల మంది ప్రజల జీవితాలను ఎలా మార్చాలనే విషయంపై చర్చించామని వివరించారు. ప్రస్తుతం ప్రతి నలుగురిలో ఒకరు పేదరికంలో జీవిస్తున్నారని మమ్దానీ చెప్పారు. న్యూయార్క్ ప్రజలను కష్టాల నుండి బయటపడేయడానికి, వారి జీవిత ప్రమాణానలు పెంచడానికి, నగరంలో మరిన్ని సదుపాయాలను కల్పించడానికి ఏం చేయాలనే దానిపై సమావేశంలో చర్చ జరిగిందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+