మోదీ దూకుడుకు డొనాల్డ్ ట్రంప్ చెక్?
అడ్డు అదుపులోని టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్.
తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం భారత్ పై పడింది. ఈ టారిఫ్ అనంతరం అంతర్జాతీయ కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. చైనా, రష్యాలతో దోస్తీని పెంపొందించుకుంది భారత్. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో అడుగుపెట్టారు. ఆ దేశాధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ తో సమావేశం అయ్యారు. ఫలితంగా భారత్- అమెరికా సంబంధాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్.. త్వరలో గ్ఝి జిన్ పింగ్ తో సమావేశం కానున్నారు. ముఖాముఖి భేటీ ఇది. దీనికోసం ట్రంప్.. దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గ్ఝియాంగ్ఝులో ఏర్పాటుకానున్న ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సదస్సుకు హాజరు కానున్నారు. ఈ అత్యున్నత సమ్మిట్ సైడ్ లైన్స్ లో భాగంగా జిన్‌పింగ్‌తో ఆయన సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ దక్షిణ కొరియా పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదు.
ఏపీఈసీ సమ్మిట్ సందర్భంగా ట్రంప్, జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల అవశాకాలను వైట్‌హౌస్ పరిశీలిస్తోందని సీఎన్ఎన్ తెలిపింది. కిందటి నెల జిన్ పింగ్.. డొనాల్డ్ ట్రంప్ కు ఫోన్ చేశారని, మెలానియాతో కలిసి తమ దేశ పర్యటనకు రావాలని ఈ సందర్భంగా ఆయన ఆహ్వానించారని పేర్కొంది. దీనిపై ట్రంప్ సానుకూలంగా స్పందించినట్లు వివరించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
తాము ఆతిథ్యాన్ని ఇస్తోన్న ఏపీఈసీ సమ్మిట్ కు హాజరు కావాలని అటు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ కూడా ట్రంప్ కు ఆహ్వానం పంపారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్- అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న విభేదాలను రూపుమాపడానికీ ఈ సమ్మిట్ ఓ వేదిక అవుతుందనే అంచనాలు ఉన్నాయి. కిమ్ హాజరవుతారా? లేదా అనేది ఇంకా తెలియరావట్లేదు.అవకాశం వస్తే కిమ్‌ను మరోసారి కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ఇంతకుముందు సూచించారు.
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications