Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్ మరో సంచలనం.. పాక్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్!

Donald Trump: దూకుడు పాలన కొనసాగిస్తున్నఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్రమ వలసలపై ట్రంప్ కఠిన చర్యలు మరింత తీవ్రమవుతున్నాయి. పాకిస్థాన్ సహా 41 దేశాలపై ప్రయాణ నిషేధం విధించడానికి పూర్తి సన్నాహాలు చేసిన ముసాయిదాను అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సారి ప్రయాణ ఆంక్షలు మరింత సమగ్రంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ఏడు ముస్లిం-మెజారిటీ దేశాల ప్రయాణికులను నిషేధించారు.

రాయిటర్స్ ప్రకారం.. అమెరికాకు ప్రయాణించకుండా ట్రావెల్ బ్యాన్ చేయబడుతున్న 42 దేశాలలో పాకిస్థాన్, ఆఫ్ఙనిస్తాన్, భూటాన్ ఉన్నాయి. అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ దూకుడు పాలన అక్రమ వలసలను అరికట్టడానికి కృషి చేస్తోంది. ప్రయాణ నిషేధం జాబితాలో ఉన్న దేశాలలో తుర్కెమెనిస్థాన్, బెలారస్, భూటాన్, వనువాటు ఉన్నాయి. ఇటీవల ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ పౌరసత్వం పొందానని చెప్పిన వనువాటు కూడా ఉండడం గమనార్హం.

Trump s Shocking Move Travel Ban on 41 Countries Including Pakistan

అంతకు ముందు పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రయాణ నిషేధ వార్తలను ఊహాగానాలుగా తోసిపుచ్చింది. పాకిస్థాన్ కు అటువంటి ఆంక్షల గురించి ఎటువంటి అధికారిక సూచనలు అందలేదని విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ అన్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని.. అందువల్ల దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని షఫ్కత్ అలీ ఖాన్ పేర్కొన్నారు. ఈ వారం తుర్కెమెనిస్థాన్ లోని పాకిస్థాన్ రాయబారి కేకే అహ్సాన్ వాగన్ అమెరికాలోకి ప్రవేశం నిరాకరించబడింది. ఆయనను లాస్ ఏంజిల్స్ బహిష్కరించడంతో అమెరికా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఇటీవల పెరిగాయి. అమెరికా ఎటువంటి నిర్దిష్ట కారణాన్ని చెప్పనప్పటికీ.. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ వివాదాస్పద వీసా సూచనలను గుర్తించడంతో వాగన్ ను బహిష్కరించినట్లు నివేదికలు వెల్లడించాయి.

కొత్త ముసాయిదా ప్రకారం 10 దేశాలు రెడ్ లిస్ట్ లో ఉంచబడ్డాయి అంటే ఆ దేశ పౌరుల వీసాలు పూర్తిగా నిలిపివేయబడతాయి. ఆ దేశాలు ఏమిటంటే.. ఆఫ్ఘనిస్తాన్, క్యూబా, ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సోమాలియా, సూడాన్, సిరియా, వెనిజులా, యెమెన్. ఐదు దేశాల రెండో గ్రూపులో ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ ఉన్నాయి. ఈ దేశాలపై కొన్ని షరతులతో పరిమితులు కూడా ప్రతిపాదించబడ్డాయి. ఐదు దేశాలలోనూ పర్యాటక, విద్యార్థి వీసాలు, అలాగే ఇతర వలస వీసాలు ప్రభావితం కావచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+