• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలివి తెల్లారింది : గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కడుందన్న ప్రశ్నకు రెండు లైఫ్ లైన్లు తీసుకుంది

|
  'Where Is Great Wall Of China?': Game Show Contestant Uses 2 Lifelines

  టర్కీ: మన దేశంలో అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కౌన్ బనేగా కరోడ్ పతి ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే.. దాన్నే తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో టాలీవుడ్ మన్మదుడు నాగార్జున హోస్ట్‌గా చేశారు. అక్కడ అడిగే ప్రశ్నలు కొన్ని మరీ సిల్లీగా ఉంటే గేమ్ లెవెల్స్ పెరుగుతూ పోతున్నసమయంలో క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతాయి. ఆ సమయంలో సాధారణంగా ఎవరైనా లైఫ్ లైన్‌లు వినియోగించుకుంటారు. కానీ ఇక్కడ ఓ యువతి మాత్రం సిల్లీ ప్రశ్నకు ఒకటి కాదు రెండు లైఫ్ లైన్లు వినియోగించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన సగటు నెటిజెన్ నవ్వాపుకోలేక పోతున్నాడు.

  ఇక విషయానికొస్తే... కౌన్ బనేగా కరోడ్‌పతి తరహాలోనే టర్కీ వెర్షన్‌లో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఆ గేమ్‌ హాట్ సీట్‌లో 26 ఏళ్ల సుఐహాన్ అనే యువతి కూర్చొంది. ఇస్తాంబుల్ నుంచి ఆర్థికశాస్త్రంలో డిగ్రీ చేసుకున్నట్లు తనను తాను పరిచయం చేసుకుంది. పరిచయ కార్యక్రమం అయ్యాక ప్రశ్నల పర్వం ప్రారంభమైంది. అందులో ఆమె ఎదుర్కొన్న ప్రశ్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎక్కడుందని..? ఆప్షన్స్ ‌గా చైనా, ఇండియా, దక్షిణ కొరియా, జపాన్‌లు ఇచ్చారు.అంతే ఈ ప్రశ్నకు సుఐహాన్‌కు చెమటలు పట్టాయి. ఎక్కడుందో సమాధానం తెలియదు. చాలాసేపు తచ్చాడింది. ఆలోచించింది. చేయాల్సినవన్నీ చేసింది. చివరకు లైఫ్ లైన్‌కు వెళ్లింది.

  Turkey contestant uses two life lines for the question Where is the great wall of china

  అంతకంటే ముందు తనకు సమాధానం తెలుసన్న సుఐహాన్...కొంచెం డౌట్ ఉందని అందుకే ఆడియన్స్ పోల్‌కు వెళతానని చెప్పింది. అయితే ఇచ్చిన సమాధానాల్లో 51 శాతం మంది ఆడియెన్స్‌ చైనా అని సరైన సమాధానం ఇచ్చారు. మరికొందరు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇండియాలో ఉందని అనుకున్నారు. ఇక సగం మందే ఆడియెన్స్ చైనా అని చెప్పడంతో మరింత మీమాంసకు గురైంది సుఐహాన్. ఇక ఆలస్యం చేయకుండా ఫోన్ ఎ ఫ్రెండ్ ఆప్షన్ వినియోగించుకుంది. మొత్తానికి తన ఫ్రెండ్ చైనా అని సమాధానం చెప్పడంతో ఎలిమినేషన్ నుంచి సుఐహాన్ తప్పించుకోగలిగింది. కానీ నెటిజన్ల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతోంది. అయితే తదుపరి ప్రశ్నగా ఓ సాంగ్‌ను వినిపించగా దాని కంపోజర్‌ను చెప్పడంలో విఫలమవడంతో ఆమె ఎలిమినేట్ అయ్యింది.

  English summary
  on the Turkish version of the popular game show Who Wants To Be A Millionaire? (The Indian version is known as Kaun Banega Crorepati?), a contestant used up two of her lifelines to answer where the Great Wall of China is located. Netizens are taking her on social media for not answering the silly question.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more