బిగ్ షాక్.. రెండు విమానాలు ఒకదానికొకటి ఢీ..!

అమెరికాలోని న్యూయార్క్‌లోగల లగార్డియా విమానాశ్రయంలో బుధవారం రాత్రి అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు వాణిజ్య విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడికి గాయాలయ్యాయి. అయితే విమానాలు నెమ్మదిగా కదులుతున్న క్రమంలో జరిగినందున పెద్ద ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది.

ఏం జరిగిందంటే..

లగార్డియా ఎయిర్‌పోర్టులోని ఒక గేటు వద్ద డెల్టా DL5047 విమానం ఆగి ఉంది. అదే సమయంలో, మరో డెల్టా ప్రాంతీయ విమానం DL5155 అదే గేట్ వైపుకి కదులుతోంది. ఈ క్రమంలో రెండో విమానం మొదటి విమానం ముక్కు భాగాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన తాకిడికి రెక్క విరిగి కిందపడింది. పైలట్లు తమ విండ్‌షీల్డ్‌కు కూడా నష్టం కలిగిందని ATC ఆడియోలో వెల్లడించింది.

two-flights-collide-at-laguardia-airport-in-newyork

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యాయి. వీడియోలో ఎమర్జెన్సీ వాహనాల లైట్లు వెలుగుతుండగా.. ఒక విమానం రెక్క దెబ్బతినడం స్పష్టంగా కనిపిస్తుంది. ATC ఆడియో ప్రకారం, విమానాలు కదులుతున్న సమయంలో ఒకటి మరొకదానికి ఢీకొన్నది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:56 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కాగా డెల్టా ఎయిర్‌లైన్స్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. DL5047 విమానంలో ప్రయాణికులు ఉన్నారని.. ఈ విమానం షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూయార్క్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు. ల్యాండింగ్ తర్వాత, రన్‌వేపై కదులుతున్న సమయంలో ఇది మరో డెల్టా విమానం ఢీకు గురై రెక్క విరిగిపోయింది.

లా గార్డియా విమానాశ్రయంలో ఇటీవలి కాలంలో భద్రతా సమస్యలు పెరుగుతున్నాయి. గత మార్చిలో కూడా డెల్టా విమానం ల్యాండింగ్ ప్రయత్నంలో రెక్క రన్‌వేకు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) విచారణ జరిపింది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రమాదంతో లగార్డియా విమానాశ్రయంలో భద్రతా మార్గదర్శకాలు మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని రేకెత్తించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడం ఊరట కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+