జస్ట్.. రెండు నెలలే!: ఆ బుడ్డోడు తల్లినే ఆశ్చర్యపరిచాడు (వీడియో)
వాషింగ్టన్: రెండు నెలల చిన్నారులకు అప్పుడే మాటలు రావన్న సంగతి అందరికీ తెలిసిందే. శబ్దాలకు ఉలిక్కిపడటం, తల్లి ఆడిస్తే నవ్వడం తప్ప.. తమ భావాలను మాటల ద్వారా వ్యక్తీకరించలేరు.
కానీ ఓ రెండు నెలల బుడ్డోడు మాత్రం తల్లినే ఆశ్చర్యపరిచాడు. తల్లి 'హలో' అనగానే.. తిరిగి 'హలో' అన్నట్లుగా ప్రతిస్పందించాడు. దీంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. క్యూట్ గా ఉన్న ఆ బుడ్డోడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పిల్లలు పుట్టినప్పటి నుంచి వారితో మధుర జ్ఞాపకాలను పదిల పరుచుకునేలా చాలామంది తల్లిదండ్రులు చిన్నారుల వీడియోలను యూట్యూబ్ లోకి ఎక్కిస్తున్నారు. క్యూట్ క్యూట్‌గా కనిపించే చిన్నారుల వీడియోలకు యూట్యూబ్‌లో ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ ఉండటంతో చాలామంది పేరెంట్స్ తమపిల్లల వీడియోలను అందులో అప్‌లోడ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications