అక్రమ సంబంధం పెట్టుకుందని.. : బికినీ విప్పి నగ్నంగా ఊరేగించారు
మాస్కో : హత్యలతోనో, దాడులతోనో అక్రమ సంబంధాలు వార్తల్లోకి ఎక్కడం పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా అక్రమ సంబంధాలతో పట్టుబడే ప్రేయసి, ప్రియుళ్లను సదరు భర్త లేదా భార్య వీధుల్లోకి ఈడ్చి కొట్టడం.. ఆ తర్వాత అది కాస్త ఇంటర్నెట్ లోకి ఎక్కి హల్ చల్ చేయడం తరుచూ వార్తల్లో కనిపిస్తున్నాయి.
ఇదే తరహాలో తాజాగా రష్యాలోని క్రిమియా అనే గ్రామంలో ఓ ఘటన చోటు చేసుకుంది. తమ భర్తలతో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని ఆగ్రహించిన ఇద్దరు మహిళలు సదరు మహిళను నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. బికినీలో ఉన్న సదరు మహిళను వీధుల్లోకి తీసుకొచ్చి వెంటబడి తరుముతూ దాడి చేశారు.

కాగా, ఎవరో వ్యక్తి ఈ తతంగాన్నంతా సోషల్ మీడియాలోకి ఎక్కించేయడంతో విషయం కాస్త వైరల్ గా మారింది. వీడియో విషయం పోలీసుల దృష్టికి కూడా వెళ్లడంతో వీడియో ఆధారంగా విచారణకు సిద్దమయ్యారు పోలీసులు. ఇదిలా ఉంటే, ఈ ఉదంతానికి సంబంధించి.. భర్తలను అదుపులో ఉంచుకోవడం చేతగాక మహిళపై దాడికి యత్నించారు అనే విమర్శలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications