వ్యాక్సిన్‌కూ లొంగని కొత్త కరోనా వైరస్: 30 మ్యుటేషన్లు: ఆరు దేశాలకు విమాన సర్వీసులు రద్దు

లండన్: రెండు సంవత్సరాలుగా భూగోళం మొత్తాన్ని గడగడలాడిస్తూ వస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి.. సరికొత్త రూపాలను పుణికి పుచ్చుకుంటోంది. కొత్త కొత్త రూపాలతో దాడి మొదలు పెట్టింది. కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. 30 మ్యుటేషన్లతో ఇది భయానకంగా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో దీనికి సంబంధించిన వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలకు వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తోంది. ఆయా దేశాల్లో కరోనా వైరస్ కేసుల్లో పెరుగుదల చోటు చేసుకుంటోంది.

Recommended Video

    Covid-19 కొత్త వేరియంట్.. ఆరు దేశాలకు Flight సర్వీసులు రద్దు! || Oneindia Telugu
    థర్డ్ వేవ్‌గా అనుమానాలు

    థర్డ్ వేవ్‌గా అనుమానాలు

    దీన్ని థర్డ్‌వేవ్‌గా భావిస్తున్నారు నిపుణులు. కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముప్పు మళ్లీ ముంచుకొచ్చిందనే ఆందోళనలను వ్యక్తం చేస్తోన్నారు. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత దాని తీవ్రత ఆఫ్రికా దేశాలపై పడిన సందర్భం పరిమితంగానే కనిపించింది. సెకెండ్ వేవ్‌లోనూ అవే తరహా పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ఈ రెండింటికీ భిన్నంగా ఈ దఫా ఈ ప్రాణాంతక మహమ్మారి ఆఫ్రికన్ దేశాల్లో పడగ విప్పింది. శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.

    కొత్త వేరియంట్..

    కొత్త వేరియంట్..

    దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్‌ను బీ.1.1.529 (B.1.1.520)గా గుర్తించారు. దీనికి సంబంధించిన 30 మ్యుటేషన్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కొత్త రకం వేరియంట్‌కు శరవేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనామ్, సహా పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొననున్నారు. వ్యాక్సిన్‌కు కూడా లొంగకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

    హాంకాంగ్‌లోనూ..

    హాంకాంగ్‌లోనూ..


    కొత్త రకం వేరియంట్ దక్షిణాఫ్రికా, బోట్సువానా సహా ఆసియాలోని హాంగ్‌కాంగ్‌లోనూ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ బారిన పడిన వారు.. దక్షిణాఫ్రికాలో పర్యటించారు. తమ స్వదేశానికి వెళ్లారు. అనంతరం వారు అనారోగ్యానికి గురయ్యారు. వారికి పరీక్షలను నిర్వహించగా.. బీ.1.1.529 బారిన పడినట్లు తేలింది. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా శివార్లలోని ష్వానె మెట్రోపాలిటన్ ఏరియాలో ఈ వైరస్‌ను తొలిసారిగా గుర్తించారు. అనంతరం శరవేగంగా వ్యాప్తి చెందినట్లు నిర్దారించారు.

    ట్రావెల్ హిస్టరీ ఉన్న వారి కోసం..

    ట్రావెల్ హిస్టరీ ఉన్న వారి కోసం..

    ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. దక్షిణాఫ్రికా సహా ఆఫ్రికన్ దేశాల ట్రావెల్ హిస్టరీ ఉన్న ప్రయాణికులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. విమానాశ్రయాల్లో తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలను కొనసాగించాలని ఆదేశించింది. ఆయా దేశాల నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్‌ పరీక్షలను నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది.

    ఆరు దేశాలకు ఫ్లయిట్లు బ్యాన్..

    ఈ పరిణామాల నేపథ్యంలో- బ్రిటన్ కూడా తక్షణ చర్యలు తీసుకుంది. ముందుజాగ్రత్తగా ఆరు ఆఫ్రికన్ దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ మేరకు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ ఉత్తర్వులను జారీ చేశారు. బోట్సువానా, దక్షిణాఫ్రికా సహా మరో నాలుగు దేశాలను ఈ జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు. వాటన్నింటినీ రెడ్ లిస్ట్‌లో చేర్చినట్లు జావిద్ తెలిపారు. ఆయా దేశాల నుంచి వచ్చే బ్రిటన్ పౌరులు కూడా తప్పనిసరిగా క్వారంటైన్‌లోకి వెళ్లాలని ఆదేశించారు.

    యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ కఠిన చర్యలు..

    యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ కఠిన చర్యలు..


    ఆఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగులోకి రావడం పట్ల యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ కొత్తగా కోవిడ్ ప్రొటోకాల్స్‌ను జారీ చేసింది. దక్షిణాఫ్రికాలో పర్యటించి వచ్చిన వారిని గుర్తించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహకారాన్ని తీసుకుంటోంది. వారి వద్ద నుంచి ట్రావెలర్స్ లిస్ట్‌ను తెప్పించుకుంటోంది. అందులో పొందుపరిచిన వివరాల ఆధారంగా ట్రావెల్ హిస్టరీ ఉన్న వారిని గుర్తిస్తోంది. తప్పనిసరిగా క్వారంటైన్‌కు వెళ్లాలని ఆదేశించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+