Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రిషి సునాక్ వారసుడు ఆయనే: ప్రధానిగా టూల్ మేకర్ కొడుకు: పక్కా శాకాహారి

Britain's next Prime Minister: బ్రిటన్‌ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ భారీ ఓటమి దిశగా సాగుతోంది. 14 సంవత్సరాల కన్జర్వేటివ్‌ల అధికారానికి చెక్ పడింది. ప్రతిపక్ష లేబర్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయ కేతనాన్ని ఎగురవేస్తోంది. ఈ ఎన్నికల్లో సునామీని సృష్టించింది. రికార్డుస్థాయిలో పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటోంది.

650 సీట్లు ఉన్న బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 326. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలోనే లేబర్ పార్టీ పూర్తి మెజారిటీని అందుకుంది. 329 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఇంకా 72 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

UK elections 2024 All you need to know next Britain s Prime Minister Keir Starmer

భారతీయ మూలాలు ఉన్న ప్రధానమంత్రి రిషి సునాక్ సారథ్యంలో మొన్నటివరకు అధికారంలో కొనసాగిన కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూడబోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థులు 74 స్థానాల్లో మాత్రమే గెలిచారు. మరో 50 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

సండర్‌ల్యాండ్‌ సౌత్‌లో తొలి విజయాన్ని అందుకుంది లేబర్ పార్టీ. ఆ పార్టీ అభ్యర్థి సర్ కీర్ స్టార్మర్ ఇక్కడి నుంచి ఘన విజయం సాధించారు. లేబర్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఆయనే. పూర్తి మెజారిటీతో లేబర్ పార్టీ అధికారంలో వస్తే స్టార్మర్.. ప్రధాని అవుతారు. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ లేబర్ పార్టీ ఆధిక్యత మరింత పెరగడం కనిపించింది.

ప్రధానమంత్రి రిషి సునాక్.. ఈ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. లేబర్ పార్టీకి అభినందనలు తెలియజేశారు. కీర్ స్టార్మర్‌కు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ వంటి అతిపెద్ద దేశానికి ప్రధానిగా పని చేసే అవకాశాన్ని ఇన్నాళ్లు ప్రజలు కల్పించారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తోన్నానని చెప్పారు.

కీర్ స్టార్మర్. 1962లో లండన్‌లో జన్మించారు. అనంతరం కుటుంబంతో కలిసి సర్రేలోని ఆక్స్‌టెడ్‌కు వెళ్లారు. తండ్రి టూల్ మేకర్. తల్లి నర్స్. తన 16వ ఏటే రాజకీయాల్లో అడుగుపెట్టారు. లేబర్ పార్టీలో జాయిన్ అయ్యారు. యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ లాలో డిగ్రీ పూర్తి చేశారు. ఆక్స్‌ఫర్ట్ యూనివర్శిటీ నుంచి సివిల్ లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు.

చదువు పూర్తయిన తరువాత మావన హక్కుల బారిస్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. నార్తరన్ ఐర్లాండ్ పోలిసింగ్ బోర్డ్ మానవ హక్కుల సలహాదారుగా పని చేశారు. 2008 నుంచి 2013 వరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2015లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయయారు. హాల్బర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్ నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.

2020లో లేబర్ పార్టీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. అప్పటివరకు ఆ స్థానంలో ఉన్న జెరెమి కార్బిన్.. 2019 నాటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో తప్పుకొన్నారు. దీనితో స్టార్మర్‌కు ఆ అవకాశం లభించింది. స్టార్మర్ పక్కా వెజిటేరియన్. లేబర్ పార్టీలో కొనసాగుతూ మాంసాహారానికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలను సైతం నిర్వహించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+