‘వికీలీక్స్’ అసాంజె ఆత్మహత్య చేసుకునే అవకాశం -అందుకే అమెరికాకు అప్పగించం: బ్రిటన్ కోర్టు
అగ్రదేశాల చీకటి వ్యవహారాలు, కీలక రహస్యాలను బట్టబయలు చేసి ఆయా ప్రభుత్వాలు, నేతలు, అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన ప్రముఖ జర్నలిస్టు, 'వికీలీక్స్' సంస్థ అధినేత జూలియన్ అసాంజెకు భారీ ఊరట లభించింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజె కేసులో అమెరికాకు ఎదురు దెబ్బ తగిలింది.
అసాంజెను అమెరికాకు అప్పగించే విషయమై బ్రిటన్ కోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. అసాంజెను అమెరికాకు అప్పగించలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు న్యాయమూర్తి వెనెస్సా బరైట్సర్ సోమవారం తీర్పును ప్రకటించారు. ఈ సందర్భంగా జడ్జి బరైట్సర్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు..

''ఏళ్లపాటు బాహ్య ప్రపంచానికి దూరంగా లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో ఆశ్రయం పొందిన అసాంజె ఇప్పటికే క్లినికల్ డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్న వ్యక్తిగా.. ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే అతణ్ని ఇప్పటికిప్పుడు అమెరికాకు అప్పగించలేం'' అని జడ్జి వెనెస్సా అన్నారు.
2010-11లో అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారం, రహస్య పత్రాలను వికిలీక్స్ బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఇరాక్, అఫ్ఘనిస్థాన్ దేశాల్లో అమెరికా యుద్ధనేరాలకు పాల్పడిందని వికీలీక్స్ ఆధారాలతో బయటపెట్టడం ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు రేపింది. ఈ కేసులో అసాంజె దోషిగా తేలినట్టయితే ఆయనకు 175 ఏండ్ల జైలుశిక్ష విధించే అవకాశముందని భావించారు.
ఈక్వెడార్ ఎంబసీ కల్పించిన ఆశ్రయాన్ని వెనక్కి తీసుకోవడంతో లండన్‌లోని మెట్రోపాలిటన్ పోలీసులు 2019 ఏప్రిల్ 11న అసాంజెను అరెస్టు చేశారు. గూఢచర్యలో ఆరోపణలకు తోడు అసాంజేపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు, స్వీడన్‌కు దొరక్కుండా ఉండేందుకు 2012 నుంచి లండన్‌లోని ఈక్వేడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications