Russia ukraine war:రోజుకు లక్ష హ్రివ్నియా విత్ డ్రాకు ఛాన్స్, జనం బారులు..
ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనానికి ఏం చేయాలో తెలియడం లేదు. దేశం దాటి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వెళ్లాలంటే నగదు కావాలి కదా.. అందుకోసమే మనీ కోసం ఏటీఎం, వాహనాలు ఫ్యూయల్ కోసం పెట్రో స్టేషన్లకు పరుగుతీస్తున్నారు. ఉక్రెయిన్‌లో దాదాపు అన్నీ నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
Recommended Video
తూర్పు ఉక్రెయిన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. చాలా మంది భయపడుతున్నారు. ఏం జరుగుతుందో తెలియని షాక్‌లో ఉన్నారు. అలాగే ఏటీఎంల వద్ద జనం బారులు తీరారు. కోస్టిట్యావ్వికా, డొనెక్టి రీజియన్‌లో గల పెట్రో స్టేషన్ల వద్ద జనం ఎక్కువగానే ఉన్నారు.

లాడా, సెర్గి బర్లీజ్ వద్ద కూడా హృదయ విదారకర దృశ్యం కనిపించింది. ఓ వ్యక్తి కారులో వెళుతున్నాడు. వెనకల అతని భార్య.. పసిగుడ్డు బిక్కుబిక్కు మని కనిపించారు. గత రాత్రి పేలుళ్ల చప్పుడు వినిపించిందని.. నటాలియా పేర్కొన్నారు. ఏం జరుగుతుందో తెలియడం లేదని వివరించారు. తన మనమరాలిని కిండర్ గార్డెన్ నుంచి తీసుకొని ఇంటికి వెళ్లిపోయానని చెప్పారు. ఇంటిలోపలే ఉంటున్నామని చాలా మంది పేరంట్స్ చెబుతున్నారు.
లావాదేవీలపై ఉక్రెయిన్ సెంట్రల్ బ్యాంక్ పరిమితి విధించింది. అందరూ నగద్ విత్ డ్రా చేయడంతో రోజుకు లక్ష హ్రివ్నియా ఉక్రెయిన్ కరెన్సీ విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంది. అంతకుమించి విత్ డ్రా చేయరాదని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ మీడియాకు తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ రాయబారి సెర్గీ కిస్లిట్యా తీవ్రంగా ఖండించారు. ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ నాయకత్వం నుంచి రష్యా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌ను అత్యవసరంగా సమావేశపరచాలని కోరారు. ఉద్రిక్తతల గురించి చర్చించే సమయం మించిపోయిందని.. ఇప్పుడు యుద్ధాన్ని ఆపే మార్గాలపై చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకప్పుడు సోవియెట్ రష్యాలో భాగమైన ఉక్రెయిన్ ఇప్పుడు యురోపియన్ యూనియన్‌కు దగ్గరవడం రష్యాకు ఏమాత్రం మింగుడుపడట్లేదు. ఉక్రెయిన్‌ని తమతో చేర్చుకోమని హామీ ఇవ్వాల్సిందిగా అమెరికా, నాటోని డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్ నాటో పక్షం చేరవద్దని.. అది తటస్థంగానే ఉండాలని అంటున్నారు. పశ్చిమ దేశాలు పుతిన్ డిమాండ్లను తిరస్కరిస్తున్నాయి. ఉక్రెయిన్ ద్వారా పశ్చిమ దేశాల నుంచి రష్యాకు ముప్పు ఉంటుందని పుతిన్ భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై దాడికి పూనుకున్నారు.












Click it and Unblock the Notifications