భారత్ కు జెలెన్ స్కీ షాక్..! ట్రంప్ నిర్ణయానికి ఫుల్ సపోర్ట్..!
మిత్రదేశం ఉక్రెయిన్ భారత్ కు షాకిచ్చింది. రష్యాతో పోరు విషయంలో గతంలో భారత్ మద్దతు కోరినా అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా తటస్థంగా ఉండాలన్న నిర్ణయం మేరకు దూరంగా ఉండిపోయింది. మరోవైపు దేశ ప్రయోజనాల పేరుతో రష్యా నుంచి భారీగా డిస్కౌంట్ చమురును కొంటూ ఆ దేశానికి పరోక్షంగా సాయం చేస్తోంది. దీనిపై ఆగ్రహంగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రష్యా చమురు కొంటున్నామనే కారణంతో భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని ఇవాళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సమర్థించారు. రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై సుంకాలు విధించాలన్నది మంచి ఆలోచన అంటూ ట్రంప్ నిర్ణయానికి అండగా నిలిచారు. చైనాలో పుతిన్ తో ప్రధాని మోడీ భేటీపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.

రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగిస్తున్న తమ యూరోపియన్ మిత్రదేశాలపైనా జెలెన్స్కీ విమర్శలు ఎక్కుపెట్టారు. పుతిన్‌పై అదనపు ఒత్తిడి అవసరమని తాము అర్థం చేసుకున్నామని, తమకు అమెరికా నుండి ఒత్తిడి అవసరమని, అలాగే సౌదీ అరేబియా నుంచీ ఒత్తిడి అవసరమని భావిస్తున్నట్లు వెల్లడించారు. యూరప్ దేశాల విషయంలో ట్రంప్ నిర్ణయాలు సరైనవే అని భావిస్తున్నట్లు జెలెన్ స్కీ తెలిపారు.

ఉక్రెయిన్ మిత్రదేశాలకు కృతజ్ఞతలు తెలుపుతూనే జెలెన్ స్కీ రష్యా చమురు కొనుగోలుపై చురకలు అంటించారు. వారిలో కొందరు రష్యా చమురు, గ్యాస్‌ను ఇంకా కొనుగోలు చేస్తూనే ఉన్నారన్నారు. ఇది న్యాయమైనది కాదన్నారు. కాబట్టి మనం రష్యా నుండి ఎలాంటి ఇంధనాన్ని అయినా కొనుగోలు చేయడం మానేయాలన్నారు. రష్యాతో ఒప్పందాలు కొనసాగించే దేశాలపై సుంకాలు విధించాలనే ఆలోచన సరైన ఆలోచన అని తాను భావిస్తున్నట్లు జెలెన్ స్కీ తెలిపారు.
-
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు











Click it and Unblock the Notifications