రష్యాకు బిగ్ షాక్ ఇచ్చిన ఉక్రెయిన్.. ఆయిల్ రిఫైనరీ పేల్చివేత
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్ పై దాడులు మరింతగా పెరిగాయి. వందల కొద్దీ డ్రోన్లు, క్షిపణులతో రష్యా విరుచుకుపడుతోంది. ఇటీవల 620 డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్ పై విధ్వంసం సృష్టంచింది. ఈ దాడులకు ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నుంచి లీవివ్ ప్రాంతాల వరకు ధ్వంసం అయింది. ఆ తర్వాత మరోసారి 728 డ్రోన్ లు,13 మిసైల్స్ తో రష్యా దాడి చేసింది. ఓ సారి 550 డ్రోన్ లు, 11 మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. అంతకుముందు 477 డ్రోన్ లు, 60 మిసైల్స్ లో భీకర దాడులు చేసింది. ఇలా వందల కొద్దీ డ్రోన్ లు, మిసైల్స్ ఉక్రెయిన్ అట్టుడుకిపోయింది.
🎯/1. Today, a lot of targets across Russia were attacked. This thread will collect information about all the struck sites overnight, based on available data:
— Special Kherson Cat 🐈🇺🇦 (@bayraktar_1love) August 2, 2025
➤ Oil refineries in Ryazan and Novokuybyshevsk⁰➤ Radar base hit in Feodosia, Crimea
➤ Primorsko-Akhtarsk Airfield —… pic.twitter.com/AILg5XVL8i
అయితే తాజాగా రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగింది. ఈ మేరకు రష్యా ఆయిల్ రిఫైనరీని పేల్చేసింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఉక్రెయిన్ సెంట్రల్ రష్యాలోని పెంజా ప్రాంతంలోని ఆయిర్ రిఫైనరీపై డ్రోన్ ఎటాక్ చేసింది. ఈ దాడిలో ఆయిర్ రిఫైనరీ పేలి పోయింది. మంటలు వివిధ ప్రాంతాలకు వ్యాపించి ముగ్గురు మృతి చెందారు. రష్యాలోని సైనికుల అవసరాలు తీర్చేందుకు ఇక్కడి నుంచే ఇంధనం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అటు రష్యాలోని ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీపైనా ఉక్రెయిన్ దాడులు చేసింది. ఇక రష్యాకు సమీపంలో రెండు అమెరికన్ అణు జలాంతర్గాములు కూడా రంగలోకి దిగాయి. ఇక అమెరికా ప్రవేశంతో రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు 50 రోజుల అల్టిమేటం ప్రకటించారు. 50 రోజుల్లో ఉక్రెయిన్ తో శాంతి చర్చలు జరపాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే జులై 28న 50 రోజుల వ్యవధిని 10 రోజులకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పుతిన్ నుంచి ఎలాంటి పురోగతి రావడం లేదని ఇక సమయం ఇచ్చి లాభం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో తాను అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ మధ్య జులై 23న మూడో దశ శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. ఇదివరకు రెండు సార్లు జరిగిన శాంతి చర్చలు విఫలం అయ్యాయి. ఈ క్రమంలోనే ట్రంప్.. రష్యాకు కీలక వార్నింగ్ ఇచ్చారు. తాజాగా రష్యాకు సమీపంలో రెండు అమెరికన్ అణు జలాంతర్గాములు కూడా రంగలోకి దిగాయి. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.












Click it and Unblock the Notifications