అధ్యక్షుడినని కూడా చూడకుండా అన్నిసార్లు అవమానిస్తారా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కు ఐక్యరాజ్యసమితిలో చుక్కెదురైంది. చేదు అనుభవాన్ని ఎదుర్కొనాల్సి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌ అడుగుపెట్టగానే ఎస్కలేటర్‌ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో వీరిద్దరూ మెట్లు ఎక్కి వెళ్లాల్సొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీనిపై వైట్ హౌస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విచారణకు ఆదేశించింది.

దీనిపై డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పదించారు. ఐక్యరాజ్యసమితిలో జరిగిన మూడు అవమానకర సంఘటనలు చోటు చేసుకున్నాయని, తనను తీవ్రంగా కలచివేశాయని వెల్లడించారు. ఇది పూర్తిగా ఉద్దేశపూరకంగా చేసినవేనని ఆరోపించారు. ది టైమ్స్ ఆఫ్ లండన్ లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితికి నిధులను నిలిపివేసిన నేపథ్యంలో అక్కడి సిబ్బంది ఎస్కలేటర్‌లను ఆపివేశారని ది టైమ్స్ ఆఫ్ లండన్ రిపోర్ట్ సెటైర్లు వేసింది.

Uncovering the Truth Trump Orders Secret Service to Investigate UN Mishaps

దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు ట్రంప్. ఎస్కలేటర్ అకస్మాత్తుగా ఆగిపోయిందని, దీనివల్ల తాను, మెలానియా కుదుపులకు లోనయ్యామని, కింద పడిపోకుండా ఐరన్ బార్స్ ను గట్టిగా పట్టుకోవలసి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరపాలని, దీనికి బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రెండవది- ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వీక్షిస్తున్న టీవీ ప్రేక్షకుల ముందు, అలాగే సమావేశ మందిరంలోని ముఖ్య నాయకుల ముందు తాను నిలబడినప్పుడు తన టెలిప్రాంప్టర్ పనిచేయలేదని ట్రంప్ తెలిపారు. టెలిప్రాంప్టర్ లేకుండానే ప్రసంగించానని, అది దాదాపు 15 నిమిషాల తర్వాత తిరిగి పనిచేయడం ప్రారంభించిందని ఆయన చెప్పారు. అయినప్పటికీ తన ప్రసంగానికి అద్భుతమైన స్పందన లభించిందని ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు.

మూడవది- ప్రసంగం తర్వాత సమావేశ మందిరంలో సౌండ్ సిస్టమ్ పూర్తిగా పనిచేయలేదని తనకు తెలియజేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రపంచ నాయకులు, ఇంటర్‌ప్రెటర్ ఇయర్‌పీస్‌లను ఉపయోగించకపోతే, ఒక్క మాట కూడా వినలేకపోయారని ఆయన అన్నారు. తన ప్రసంగానికి సంబంధించిన ఒక్క మాట కూడా తనకు వినిపించలేదని మెలానియా బదులిచ్చారని ట్రంప్ వెల్లడించారు. ఈ సంఘటనలు యాదృచ్చికం కాదని, ఐక్యరాజ్యసమితిలో ఇది మూడు రెట్ల విధ్వంసకరమని స్పష్టం చేశారు.

ఈ ఘటనలపై తక్షణమే దర్యాప్తు జరపాలని కోరుతూ సెక్రటరీ జనరల్‌కు ఈ లేఖ కాపీని పంపినట్లు ట్రంప్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి తన విధులను సరిగా నిర్వర్తించకపోవడానికి ఇదే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్కలేటర్‌లోని అన్ని సెక్యూరిటీ టేపులను, ముఖ్యంగా ఎమర్జెన్సీ స్టాప్ బటన్‌కు సంబంధించిన వాటిని భద్రపరచాలని సూచించారు. ఈ విషయంలో సీక్రెట్ సర్వీస్ కూడా పాలుపంచుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+