ప్లేన్‌లో యోగా, భార్యను చంపుతానంటూ హంగామా!

హోనోలులు: ఓ వ్యక్తి విమానంలో యోగా చేయడమే గాకుండా అడ్డుకున్నందుకు భార్యను, మిగితా ప్రయాణికులందర్నీ చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో చోటుచేసుకుంది. దక్షిణ కొరియాకి చెందిన యోంగ్‌టే పే అనే వ్యక్తి హోనోలులు నుంచి జపాన్‌కి వెళుతున్న విమానంలో ప్రయాణిస్తున్నాడు.

హోనలులు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం బయల్దేరిన కాసేపటికి తన సీటులో కూర్చోకుండా పక్కవారికి ఇబ్బంది కలిగిస్తూ యోగా చేయడం మొదలుపెట్టాడు. సీటులో కూర్చోమని అతని భార్య, ఇతర ప్రయాణికులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పైగా వారిపై గట్టిగా కేకలు వేశాడు.

అడ్డువచ్చిందని భార్యను కూడా తోసిపారేశాడు. అంతేగాక, చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో విమానాన్ని తిరిగి హవాయికి మళ్లించాల్సి వచ్చింది. అతని వికృత చేష్టలకి ప్రయాణికులు, సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌బీఐ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

United Airlines flight aborted after pensioner refuses to stop doing yoga and threatens to kill everyone

తనకు భోజన సమయంలో సీట్‌లో కూర్చోవాలనిపించలేదని అందుకే సీట్‌ వెనక్కి వెళ్లి యోగా, ధ్యానం చేసుకోవాలనుకున్నానని వివరించాడు. యోంగ్‌టే అసహజ ప్రవర్తనతో తమకు ఇబ్బంది కలిగించడమే కాక దేవుడు లేడు.. అందరినీ చంపేస్తానంటూ బెదిరించాడని ప్రయాణికులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తోటిప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బంది పెట్టినందుకు యోంగ్‌టే 25,000 డాలర్లు జరిమానా చెల్లించాలని, దీంతో పాటు అతను ప్రస్తుతం ఉన్న ఓహు ద్వీపం దాటి వెళ్లకూడదని అధికారులు పేర్కొన్నారు. మానసిక చికిత్స కూడా తీసుకోవాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+