మాట నిలబెట్టుకున్న ఒబామా: హెచ్1-బీ వీసాపై నిబంధనలు సరళతరం
హెచ్-1బీ వీసాలపై నిబంధనలను సరళతరం చేస్తానని హామీ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మాటను నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఉంటున్న వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకోవడానికి అమెరికా ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.

ఈ సంవత్సరం మే 26 నుంచి ఇది అమల్లోకి రానుంది. జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఒబామా, సమగ్ర వలస విధాన సంస్కరణల్లో భాగంగా హెచ్-1బీ వీసా అనుమతులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో అమెరికాలో ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన జీవిత భాగస్వామ్యులు(భార్య లేదా భర్త) అర్హతలు వుండి కూడా, నిబంధనల కారణంగా ఉద్యోగం చేసుకునే అవకాశం లేని భారతీయులకు ఇదొక మంచి అవకాశం.












Click it and Unblock the Notifications