కమల హ్యారిస్‌కు షాకిచ్చిన బేబి హిప్పో

Donald Trump vs Kamala Harris: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి రేసు ఆరంభమైంది. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. పలు రాష్ట్రాల్లో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది.

మధ్యాహ్నానికి 95 మిలియన్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ ఉన్నారు. ఓహియో సిన్సినాటిలో గల సెయింట్ ఆంథొని పడువా మారొనైట్ క్యాథలిక్ చర్చిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.

US election 2024 Baby hippo Moo Deng predicts Donald Trump will win

ఈ ఎన్నికల్లో హోరాహోరి పోరు నెలకొంది. న్యూ హ్యాంప్‌షైర్ స్టేట్‌లోని డిక్స్ విల్లే నాచ్‌లో పడిన ఆరు ఓట్లల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్‌కు చెరిసగం ఓట్లు పోల్ అయ్యాయి. ఇద్దరికీ మూడు చొప్పున ఓట్లు పడ్డాయి. పోలింగ్ ముగిసే కొద్దీ ఫలితాలు వెల్లడవుతుంటాయి.

ఈ పరిస్థితుల్లో అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనే విషయంపై థాయ్‌లాండ్‌కు చెందిన ఓ బేబీ హిప్పోపొటమస్.. తన జోస్యాన్ని వెల్లడించింది. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారని, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు పరాభవం తప్పకపోవచ్చని సంకేతాలను ఇచ్చింది.

US election 2024 Baby hippo Moo Deng predicts Donald Trump will win

ఈ బేబీ హిప్పోపొటమస్ పేరు మూ డెంగ్. థాయ్‌లాండ్‌లోని సి రాచ సిటీలోని ఖావో ఖీవ్ జూ పార్క్‌కు చెందిన హిప్పో ఇది. ఈ ఏడాది జులైలో జన్మించింది. దీనికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లల్లో ఈ బేబీ హిప్పోకు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంటాయి.

తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం దీన్ని రంగంలోకి దించారు జూ అధికారులు. మూ డెంగ్ బేబీ హిప్పో కోసం రెండు పుచ్చకాయలను తెప్పించారు. ఒకదానిపై డొనాల్డ్ ట్రంప్, మరో దానిపై కమలా హ్యారిస్ పేర్లు, ఫొటోలను అతికించారు. బేబీ హిప్పో, దాని తల్లి కోసం వాటిని ఆహారంగా ఉంచారు. బేబీ హిప్పో నేరుగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఉన్న పుచ్చకాయను ఆహారంగా స్వీకరించింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బేబీ హిప్పో జోస్యం ఫలిస్తుందని, గతంలోనూ కొన్ని దేశీయ స్థాయి అంచనాలు నిజం అయ్యాయని జూ ఉద్యోగులు చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అవుతుందనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+