ఈ రాష్ట్రాల్లో ట్రంప్ సునామీ గెలుపు

Donald Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇంకో రెండు గంటల్లో పోలింగ్ ముగుస్తుంది. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. పలు రాష్ట్రాల్లో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది.

ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. న్యూ హ్యాంప్‌షైర్ స్టేట్‌లోని డిక్స్ విల్లే నాచ్‌లో పడిన ఆరు ఓట్లల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్‌కు చెరిసగం ఓట్లు పోల్ అయ్యాయి. ఇద్దరికీ మూడు చొప్పున ఓట్లు పడ్డాయి. పోలింగ్ ముగిసే కొద్దీ ఫలితాలు వెల్లడవుతుంటాయి.

US elections 2024

అధికారంలోకి రావడానికి ప్రతి స్టేట్‌లోనూ 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరమౌతాయి. మొత్తం 50 రాష్ట్రాలు ఉన్న అమెరికాలో ఏడు మాత్రమే అధ్యక్షుడిని నిర్ధారిస్తాయి. మిగిలిన రాష్ట్రాల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు స్టాండర్డ్ ఓటుబ్యాంక్ ఉండటమే దీనికి కారణం. అరిజోనా, పెన్సిల్వేనియా, మిచిగాన్, జార్జియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవడాల్లో అధిక శాతం ఓట్లను పొందిన వాళ్లదే విజయం.

అన్నిటికంటే ముందు కెంటకీ, ఇండియానాల్లో పోలింగ్ ముగిసింది. ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఈ రెండు చోట్లా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ రెండు చోట్ల కూడా డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యతలో కనిపించారు. కెంటకీలో 68 శాతంతో 72,945, ఇండియానాలో 57.6 శాతంతో 1,77,496 ఓట్లు పడ్డాయి. కెంటకీ కమలా హ్యారిస్‌కు 34, 108, ఇండియాలో 1,26,570 ఓట్లో పోల్ అయ్యాయి.

అలబామా, జార్జియా, ఫ్లోరిడా, సౌత్ కరోలినా, వర్జీనియాల్లో పోలింగ్ తుదిదశకు చేరుకుంది. ఇండియానాలోని గిబ్సన్, జాస్పర్, లేక్, లాపొర్టె, న్యూటౌన్, పెర్రీ, పోర్టర్, పోసె, స్పెన్సర్, స్టార్క్, వాండెర్బర్గ్, వార్రిక్‌లల్లో పోలింగ్ ముగిసినట్లు ఎలక్టోరల్ కాలేజీ వెల్లడించింది.

7 గంటలకు జార్జియా, సౌత్ కరోలినా, వెర్మాంట్, వర్జీనియా, ఫ్లోరిడా, 7:30 గంటలకు నార్త్ కరోలినా, ఓహియో, వెస్ట్ వర్జీనియా, రాత్రి 8 గంటలకు అలబామా, కనెక్టికట్, డెలావెర్, కొలంబియా, ఇల్లినాయిస్, కన్సాస్, మేరీల్యాండ్, మిస్సిస్సిపి, న్యూజెర్సీ, ఓక్లహామా, రోడ్స్ ఐలండ్, కొలరాడో, మిన్నెసోటా, న్యూయార్క్‌ వంట రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+