Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

MAGA: అమెరికా ఎరుపుమయం- డీప్ రెడ్ స్టేట్స్ ఇవే

Donald Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లు విజయఢంకా మోగించారు. 2016 తరువాత మరోసారి అధికారాన్ని అందుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ అగ్రరాజ్యానికి రెండోసారి సారథ్యాన్ని వహించబోతోన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA) నినాదం ట్రంప్‌కు విజయాన్ని అందించింది.

స్వింగ్ స్టేట్స్‌లో..

అధికారంలోకి రావడానికి ప్రతి స్టేట్‌లోనూ 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరమౌతాయి. మొత్తం 50 రాష్ట్రాలు ఉన్న అమెరికాలో ఏడు మాత్రమే అధ్యక్షుడిని నిర్ధారిస్తాయి. మిగిలిన రాష్ట్రాల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు స్టాండర్డ్ ఓటుబ్యాంక్ ఉండటమే దీనికి కారణం. అరిజోనా, పెన్సిల్వేనియా, మిచిగాన్, జార్జియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవడాల్లో అధిక శాతం ఓట్లను పొందిన వాళ్లదే విజయం.

US elections 2024 results Donald Trump and Kamala Harris wins these States

51 శాతం..

ఈ మార్క్‌ను అవలీలగా అధిగమించారు డొనాల్డ్ ట్రంప్. 277 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. ఆయనకు పోల్ అయిన మొత్తం ఓర్ల సంఖ్య ఏడు కోట్లను దాటింది. 7,12,02,731 పోల్ అయిన ఓట్లల్లో 51 శాతం ట్రంప్‌కే పడ్డాయి. ఒకరకంగా ఆయన ఈ ఎన్నికలను ఏకపక్షంగా మార్చివేసినట్టయింది.

రెండో స్థానానికే..

డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు పడ్డ ఓట్ల శాతం 47.50. మొత్తంగా 6,62,64,540 ఓట్లకే ఆమె పరిమితం కావాల్సి వచ్చింది. 2019 నాటి ఎన్నికల్లో డెమోక్రాట్లకు పట్టం కట్టిన కొన్ని కీలక రాష్ట్రాలు ఈ దఫా స్వింగ్ అయ్యాయి. రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపాయి.

ట్రంప్‌కు పట్టం కట్టిన రాష్ట్రాలు..

ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయదుందుభి మోగించన రాష్ట్రాల జాబితాలో మోంటానా, ఇడాహో, వ్యోమింగ్, ఉటా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, నెబ్రస్కా, కన్సాస్, ఓక్లహామా, టెక్సాస్, లూసియానా, అర్కాన్సాస్, మిస్సౌరీ, ఇవోహ, విస్కాన్సిన్, ఇండియానా, కెంటకీ, టెన్నెస్సె, మిస్సిస్సిపి, అలబామా, ఫ్లోరిడా, జార్జియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, పెన్సిల్వేనియా ఉన్నాయి.

కమల హ్యారిస్ గెలిచినది ఇక్కడే..

వాషింగ్టన్ డీసీ, ఒరెగాన్, కాలిఫోర్నియా, కొలరాడో, న్యూ మెక్సికో, మిన్నెసొటా, ఇల్లినాయిస్, న్యూయార్క్, వెర్మాంట్, న్యూ హ్యాంప్‌షైర్, మస్సాచుసెట్స్, కనెక్టికట్, న్యూజెర్సీ, డెలావర్, వర్జీనియా, మేరీల్యాండ్‌లల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ విజయం సాధించారు. నెవడా, అరిజోనా, మిచిగాన్‌లల్లో ఇద్దరి మధ్యా టైట్ ఫైట్ నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+