Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ ప్రభంజనం

Donald Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రారంభ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ ప్రభంజనం వీస్తోంది. పలు రాష్ట్రాలు ఎరుపుమయం అవుతున్నాయి క్రమ క్రమంగా. డెమోక్రాట్లకు ఎదురు దెబ్బ తప్పకపోవచ్చనే సంకేతాలను ఇచ్చాయి.

అధికారంలోకి రావడానికి ప్రతి స్టేట్‌లోనూ 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరమౌతాయి. మొత్తం 50 రాష్ట్రాలు ఉన్న అమెరికాలో ఏడు మాత్రమే అధ్యక్షుడిని నిర్ధారిస్తాయి. మిగిలిన రాష్ట్రాల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు స్టాండర్డ్ ఓటుబ్యాంక్ ఉండటమే దీనికి కారణం. అరిజోనా, పెన్సిల్వేనియా, మిచిగాన్, జార్జియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవడాల్లో అధిక శాతం ఓట్లను పొందిన వాళ్లదే విజయం.

అన్నిటికంటే ముందు కెంటకీ, ఇండియానా, వెర్మాంట్‌లల్లో పోలింగ్ ముగిసింది. ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఈ రెండు చోట్లా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ రెండు చోట్ల కూడా డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యతలో కనిపించారు. కెంటకీలో 68 శాతంతో 72,945, ఇండియానాలో 57.6 శాతంతో 1,77,496 ఓట్లు పడ్డాయి.

Donald Trump

కెంటకీ కమలా హ్యారిస్‌కు 34, 108, ఇండియాలో 1,26,570 ఓట్లో పోల్ అయ్యాయి. కెంటకీ, ఇండియానాల్లో డొనాల్డ్ ట్రంప్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ రెండింటినీ తన ఖాతాలో వేసుకున్నారు. సహజంగా ఈ రెండు రాష్ట్రాలు కూడా డీప్ రెడ్‌కు చెందనవే. రిపబ్లికన్లకు గట్టిపట్టు ఉన్నవే. ఇక్కడ ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

వెర్మాంట్‌లో కమలా హ్యారిస్ బోణీ కొట్టారు. తన సమీప ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై భారీ మెజారిటీతో దూసుకెళ్తోన్నారు. ఆయనకు అందనంత ఎత్తులో ఓట్లను కొల్లగొట్టారామె. ప్రస్తుతం కమల హ్యారిస్‌కు 12,579 ఓట్లు పోల్ కాగా.. డొనాల్డ్ ట్రంప్‌కు 5,644 ఓట్లు పడ్డాయి. ఇద్దరి మధ్యా 30 శాతానికి పైగా తేడా ఉంటోంది.

స్వింగ్ స్టేట్స్ జార్జియా, సౌత్ కరోలినా, ఫ్లోరిడాల్లో సైతం డొనాల్డ్ ట్రంప్ విజృంభిస్తోన్నారు. జార్జియా, ఫ్లోరిడాల్లో కమలా హ్యారిస్‌ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నారు. జార్జియాలో ట్రంప్‌కు 62.5 శాతంతో 6,51,177 ఓట్లు పోల్ అయ్యాయి. కమలా హ్యారిస్‌కు 37.0 శాతంతో 3,85,216 ఓట్లు పడ్డాయి. లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

ఫ్లోరిడాలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ ట్రంప్‌కు 54.8 శాతంతో 49,47,232 ఓట్లు పోల్ అయ్యాయి. కమలా హ్యారిస్‌కు 44.2 శాతంతో 39,95,425 ఓట్లు పడ్డాయి. లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా రాష్ట్రాలు ట్రంప్ ఖాతాలో పడ్డాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+