మా గర్భంపై మీ పెత్తనం ఏంటి?: యూఎస్ ఎన్నికల్లో బిగ్ టర్న్

Donald Trump vs Kamala Harris: ఇంకో రెండు రోజులు. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. దాదాపుగా 35 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరో నాలుగు సంవత్సరాల పదవి కోసం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.

హోరాహోరీ

పోలింగ్ గడువు సమీపించిన నేపథ్యంలో ఎన్నికల ప్రచార వేడిగా పతాక స్థాయికి చేరింది. ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, ఈ దఫా ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.

US elections 2024 Women s March protesters support Kamala Harris

మూడోసారి..

ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. ట్రంప్ వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. 2016 నాటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆయన ఆ తరువాతి ఎన్నికల్లో ఓడిపోయారు. మూడోసారి బరిలో నిలిచారు.

ముమ్మర ప్రచారం..

నార్త్ కరోలినా, ఆస్టిన్, టెక్సాస్, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ వంటి రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఇప్పటికే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ముమ్మర ప్రచారాన్ని సాగిస్తోన్నారు. మిచిగాన్‌, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినాల్లో తాజాగా కమలా హ్యారిస్ ర్యాలీలను హోరెత్తించారు.

US elections 2024 Women s March protesters support Kamala Harris

కమల కోసం..

కమలా హ్యారిస్‌కు మద్దతుగా తాజాగా వేలాదిమంది మహిళలు రోడ్డెక్కారు. వాషింగ్టన్ డీసీలో భారీ ప్రదర్శన చేపట్టారు. అధ్యక్షుడి అధికారిక నివాసం ఉన్న ఫ్రీడమ్ ప్లాజాలో గుమిగూడారు. కమల హ్యారిస్‌కు మద్దతుగా ప్లకార్డులను ప్రదర్శించారు. డ్రమ్స్ వాయిస్తూ సందడి చేశారు. వాళ్లందరూ కూడా విమెన్స్ మార్చ్ ప్రొటెస్టర్స్ గ్రూప్‌కు చెందిన సభ్యులు.

అబార్షన్ నేరమా?

ఆ దేశ కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం ఈ ర్యాలీ కొనసాగింది. రిపబ్లికన్లు అనుసరిస్తోన్న అబార్షన్ విధానాన్ని ఈ గ్రూప్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 24 వారాలు దాటిన అబార్షన్ చేయించుకోవడాన్ని నేరంగా పరిగణిస్తోంది రిపబ్లికన్ పార్టీ. తమ గర్భంపై వాళ్ల పెత్తనం ఏమిటనేది విమెన్స్ మార్చ్ ప్రొటెస్టర్స్ గ్రూప్ వాదన.

US elections 2024 Women s March protesters support Kamala Harris

వేలమంది..

ఈ క్రమంలో ఈ గ్రూప్ కమలా హ్యారిస్‌కు తమ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా- వాషింగ్టన్ డీసీలోని ఫ్రీడమ్ ప్లాజా వద్ద భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించింది. దాదాపుగా 10,000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారని విమెన్స్ మార్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేఛల్ లియరీ కార్మోనా తెలిపారు.

ఇవే డిమాండ్లు..

అమెరికాలో గల మొత్తం 50 రాష్ట్రాల్లో ఇలాంటి ర్యాలీలను నిర్వహించనున్నట్లు రేఛల్ చెప్పారు. అబార్షన్‌ను చేయించుకునే హక్కును పునరుద్ధరించడం, సమాన వేతనం, పేరింటల్ లీవులపై పన్నులు, ఛైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ను అమలు చేయడం, పౌరసత్వ నిబంధనలను మరింత సరళీకరించడం అనే డిమాండ్‌తో వాళ్లంతా ఈ ప్రదర్శనలను చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+