భారతీయులకు బిగ్ షాక్.. అమెరికాలో ఇలా చేస్తే జీవితకాలం వీసా బ్యాన్..!

అమెరికా వెళ్లాలని చాలా మందికి కలగా ఉంటుంది. విద్య, ఉపాధి అవసరాల కోసం అమెరికా వెళ్తుంటారు. అయితే ఈ మధ్య కొంతమంది విదేశీయులు అమెరికాలో అక్రమ కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. చోరీలు.. ఇతర అసాంఘీక కార్యకలాపాల్లో విదేశీయులు అక్కడి పోలీసులకు చిక్కుతున్నారు. అయితే ఇదే విషయంపై తాజాగా ట్రంప్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశీయులు అమెరికాలో నేరాలకు పాల్పడితే లైఫ్ టైమ్ పాటు వీసాలపై బ్యాన్ ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇటీవల భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. అమెరికాలోని భారత పౌరులు అక్కడి చట్టాలను, స్థానిక నియమాలను పాటించాలని స్పష్టం చేశారు.

అమెరికాకు వచ్చే విదేశీయులకు సంబంధించిన మరోసారి యూఎస్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. అమెరికాకు వచ్చే విదేశీయులు ఇక్కడ నేరాలకు పాల్పడితే జీవితకాలం పాటు వీసాను బ్యాన్ చేస్తామని హెచ్చరించింది. "ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమాజం తప్పక పాటించాలి. విదేశీయులకు ఇక్కడ నేరాలు, దౌర్జన్యాలు చేయరాదు. అమెరికాలో మీరు చట్టాన్ని అతిక్రమిస్తే.. మీ వీసాపై నిషేధం ఉంటుంది. మీరు ఇక ఎప్పటికీ అమెరికాలో కాలు పెట్టలేరు" అని అమెరికా దౌత్య కార్యాలయం ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.

గత రెండు వారాల్లో ఇలా మూడోసారి అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల విదేశీయులు అమెరికాలో పలు నేరాల్లో పట్టుబడుతున్నారు. ఈ మేరకు అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం యూరోప్ పర్యటనలో ఉన్నారు. అయితే యూరోప్ లో ట్రంప్ మరోసారి వలసవాదులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ దేశాల్లోకి వలసలు కొనసాగుతున్నాయని ట్రంప్ అన్నారు. వలసలు ఆగకుంటే యూరోప్ నాశనం అవుతుందని హెచ్చరించారు. వలసలు యూరోప్ ను చంపేస్తున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. యూరోప్ లోని స్కాట్ ల్యాండ్ లో పర్యటించిన ట్రంప్ అక్కడి మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి 2020 అంచనాల ప్రకారం, దాదాపు 87 మిలియన్ల వలసదారులు యూరప్‌ లో నివసిస్తున్నారని సమాచారం.

US Embassy Warns Foreigners Committing Crimes Face Lifetime Visa Ban

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) అనే విధానాన్ని అమలు చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వలసదారుల బహిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే ఇప్పటివరకు వేలాది మందిని వలసదారులను బహిష్కరించారు. ట్రంప్ కఠిన వైఖరి కారణంగా అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+