భారీగా కొత్త టారిఫ్- నొప్పి తెలియకుండా పెంచాం

Trump Tariff: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ సంచలన నిర్ణయాలను తీసుకుంటోన్నారు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్‌తో బెంబేలెత్తిస్తోన్నారు. భారత్ సహా పలు దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవే అవన్నీ కూడా. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం మొదలుకుని నిధుల నిలిపివేత వరకూ ఆయన వేసిన ప్రతి అడుగూ ప్రకంపనలను పుట్టిస్తూ వచ్చినవే.

భారత్ సహా ట్రంప్ టారిఫ్‌ను ఎదుర్కొంటోన్న దేశాల్లో కెనడా, మెక్సికో, చైనా ఉన్న విషయం తెలిసిందే. ఈ నాలుగు దేశాలపైన సరికొత్త టారిఫ్‌ను ఆయన కిందటి నెలలో ప్రకటించారు. ఈ క్రమంలో మెక్సికోపై అత్యధికంగా టారిఫ్ భారం పడింది. 25 శాతం టారిఫ్‌ను అదనంగా చెల్లించాల్సి వచ్చింది. కెనడా, చైనాలపై 10 శాతం మేర టారిఫ్‌ను విధించింది అమెరికా.

US imposes 25 percent tariff on all automotive vehicles made outside of the Country

ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. తాజాగా ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను విధించారు. 25 శాతం వరకు టారిఫ్ పెంచారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అమెరికాకు ఆటోమోటివ్ వాహనాలను ఎగుమతి చేస్తోన్న భారత్ సహా అన్ని అన్ని దేశాలపైనా దీని ప్రభావం పడినట్టయింది.

ఈ టారిఫ్.. ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన అనంతరం ట్రంప్ మాట్లాడారు. టారిఫ్ పెంపుదలో చాలా ఫెయిర్‌గా ఉంటామని వ్యాఖ్యానించారు. తమ మంచితనాన్ని ఇతర దేశాలు సొమ్ము చేసుకున్నాయని, ఇన్నాళ్లూ తమ ఉత్పత్తులపై భారీగా టారిఫ్ వసూలు చేశాయని గుర్తు చేశారు.

అందుకే ఈ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ తెలిపారు. తమ దేశ పౌరులు ఆశ్చర్యపోయేలా టారిఫ్ ఉంటోందని, ఈ విధానం వారిని ధనవంతులుగా మార్చుతుందనీ పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో అమెరికాకు 600 నుండి ఒక ట్రిలియన్ డాలర్ల వరకు ఆదాయాన్ని పెంచుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.

ఫలితంగా- తమ దేశం చేసిన అప్పులు తీర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని డొనాల్ట్ ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే- డొమెస్టిక్ ఆటోమోటివ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌కు ఈ టారిఫ్ ఊతం ఇస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారాయన. కొత్త కొత్త టారిఫ్‌లను విధించడం ట్రంప్‌కు ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ రెసిప్రోకల్ టారిఫ్‌ను విధించారాయన.

అధిక పన్నుల వల్ల భారత్‌కు ఏదైనా ఓ వస్తువును విక్రయించడం దాదాపు అసాధ్యంగా మారిందంటూ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలు, ప్రత్యేకించి- భారత్ సహా అధిక టారిఫ్‌ను విధించే దేశాలు.. తమ దేశ ప్రయోజనాలను ఉపయోగించుకోవడాన్ని అమెరికా ఇకపై ఎంతమాత్రం కూడా సహించదని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+