ఎన్నికల వేళ.. బైడెన్ సంచలనం: ఆసియాలో ఉద్రిక్తత?

US President Elections 2024: గడువు సమీపిస్తోన్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి పతకా స్థాయికి చేరుకుంటోంది. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరగబోయే ఈ ఎన్నికల్లో అధ్యక్షుడి కుర్చీ కోసం పోటీ పడే అభ్యర్థులు ఖరారు కావడంతో ర్యాలీలు, పబ్లిక్ ర్యాలీలు, డిబేట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. 2016 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2019లో పరాజయం పాలయ్యారు. మూడోసారి బరిలో దిగారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ బరిలో దిగారు.

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చారు. పార్టీని గెలిపించే క్రమంలో కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారాయన. తాజాగా సరికొత్త అణ్వాయుధ విధానాలకు సంబంధించిన ముసాయిదాలపై సంతకం చేశారు.న్యూక్లియర్ ఎంప్లాయ్‌మెంట్ గైడెన్స్గా దీనికి పేరు పెట్టారు.

అన్ని రంగాల్లోనూ తనకు ప్రత్యర్థిగా ఎదిగిన చైనాను దూకుడును నిలువరించే క్రమంలో కొత్త అణ్వాయుధ విధానాలను తెరమీదికి తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. మరో రెండు నెలల్లో అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జో బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం.. ఆసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణానికి కారణమౌతుందనే వాదనలూ లేకపోలేదు.

ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అమెరికా తన అణ్వస్త్ర విధానాలను సమీక్షిస్తుంటుంది. అధిక భాగం పాత విధానాల్లో స్వల్ప మార్పులు లేదా యధాతథంగా దాన్ని ఆమోదిస్తుంటుంది. ఈ దఫా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది అగ్రరాజ్యం. కీలక మార్పులు చేర్పులు చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

Joe Biden 3

దీనిపై జో బైడెన్ అధికారిక నివాసం వైట్ హౌస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆమోదం కోసం ఓ అన్ ప్లాన్డ్ నోటిఫికేషన్‌‌ను యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్‌కు పంపించే అవకాశం ఉందంటూ వైట్ హౌస్ పేర్కొందని, అది న్యూక్లియర్ ఎంప్లాయ్‌మెంట్ గైడెన్స్ కావొచ్చని న్యూయార్క్ టైమ్స్ అంచనా వేసింది.

ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అమెరికా తన అణ్వస్త్ర విధానాలను సమీక్షిస్తుంటుంది. అధిక భాగం పాత విధానాల్లో స్వల్ప మార్పులు లేదా యధాతథంగా దాన్ని ఆమోదిస్తుంటుంది. ఈ దఫా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది అగ్రరాజ్యం. కీలక మార్పులు చేర్పులు చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+