భారత్ అంటే గౌరవమే గానీ- హి ఈజ్ ఎ కిల్లర్..: ట్రంప్ నోట సంచలన మాట

Donald Trump latest comments On PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఆసియాలో పర్యటిస్తోన్నారు. అయిదు రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటించాల్సి ఉంది. మలేషియా, జపాన్ పర్యటన ముగిసింది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో అడుగు పెట్టారు. ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆసియాలో ఇది ఆయన తొలి పర్యటన కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే- ఆయన చేపట్టిన సుదీర్ఘ విదేశీ యాత్ర కూడా ఇదే.

ఈ సందర్భంగా జియోంగ్జులో ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేసిన విందుకు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రత్యేకించి- భారత్ గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భారత్ తో ట్రేడ్ డీల్ గురించీ వివరించారు.

US President Donald Trump Praises Strong Bond with PM Narendra Modi Expresses Great Respect

ప్రధాని మోదీని ఎంతగానో అభిమానిస్తానని, గౌరవిస్తానని ట్రంప్ తెలిపారు. మోదీ ఓ శక్తిమంతుడైన నాయకుడిగా అభివర్ణించారు. ఆరాధనీయుడిగా కొనియాడారు.చూడటానికి చాలా మంచి వ్యక్తి అని, తండ్రి లాంటివాడని చెప్పారు. "ప్రధాని మోదీ ఓ అద్భుత నాయకుడు. ఓ కిల్లర్.. చాలా ధైర్యవంతుడు కూడా. పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు ఓ పట్టాన ఒప్పుకోలేదు. కాల్పులను విరమించాలని నేను కోరగా.. కుదరదని తేల్చి చెప్పారు. మేము పోరాడతామని స్పష్టం చేశారు. అప్పుడు నేను ట్రేడ్ డీల్ గురించి ప్రస్తావించాల్సి వచ్చింది.." అని ట్రంప్ వివరించారు.

ఇరు దేశాలు పోరాడుతున్నంత కాలం వారితో ఎటువంటి ట్రేడ్ డీల్స్ ఉండబోవని, వ్యాపారం చేయబోమని కరాఖండిగా చెప్పానని, ఆ తర్వాతే భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మోదీతో మాట్లాడిన అనంతరం పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఫోన్ చేశానని తెలిపారు. భారత్‌తో పోరాడుతున్నందున వాణిజ్య, వ్యాపార ఒప్పందాలు చేసుకోలేమని స్పష్టంగా తెలియజేయాలనని అన్నారు.

కాదు, కూడదు అంటే 250 శాతం టారిఫ్ విధిస్తానని భారత్, పాకిస్తాన్ లను బెదిరించానని ట్రంప్ తేల్చి చెప్పారు. ఆ తర్వాత 48 గంటల్లోనే ఇరు దేశాలు కాల్పుల విరమణను ముగించడానికి అంగీకరించాయని తెలిపారు. ఈ సందర్భంగా ఏడు విమానాలను కూల్చివేశారని, అవన్నీ అందమైన ఫ్లైట్లు అని వ్యాఖ్యానించారు ట్రంప్. సకాలంలో తాను జోక్యం చేసుకోవడం వల్ల లక్షలాది ప్రాణాలకు రక్షణ లభించిందని వాదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+