మన్మోహన్ సింగ్ గురించి గొప్పగా చెప్పిన జో బైడెన్
Dr Manmohan Singh: ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల అగ్రరాజ్యం అమెరికా సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఘన నివాళి అర్పించింది. ఆయన హయాంలో చోటు చేసుకున్న సంస్కరణలను గుర్తు చేసుకుంది. అమెరికా- భారత్ సంబంధాలు అత్యున్నత స్థాయిలో కొనసాగాయని పేర్కొంది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుసగా రెండుసార్లు ప్రధానమంత్రిగా పని చేశారు మన్మోహన్ సింగ్.

ఆయన మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ సంతాపం తెలిపారు. నిఖార్సయిన రాజనీతిజ్ఞుడిగా అభివర్ణించారు. తన జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేశారని అన్నారు. 1991లో ఆర్థిక శాఖలో, 2004 నుండి 2014 వరకు ప్రధానమంత్రిగా భారత్‌ను దివాలా అంచుల నుండి రక్షించిన ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా కొనియాడారు.
ఈ మేరకు అధ్యక్షుడి అధికారిక నివాసం.. వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ వ్యూహాత్మక దృక్పథం, సాహసోపేత నిర్ణయాలు లేకపోతే అమెరికా- భారత్ మధ్య అపూర్వమైన, అత్యున్నతమైన సహకారం సాధ్యమయ్యేది కాదని జో బైడెన్ చెప్పారు.
అమెరికా- భారత్ పౌర అణు ఒప్పందాన్ని కార్యాచరణలోకి తీసుకుని రావడం మొదలుకుని ఇండో- పసిఫిక్ భాగస్వామ్య దేశాల మధ్య మొట్ట మొదటి క్వాడ్‌ను ప్రారంభించడంలో మన్మోహన్ సింగ్ ఎంతో సహాయ సహకారాలను అందజేశారని జో బైడెన్ గుర్తు చేసుకున్నారు. భారత్ సహా ప్రపంచ దేశాల భవిష్యత్‌కు దిశానిర్దేశం చేయగలిగారని, భావి తరాల కోసం పురోగమన బాటలు వేశారని అని చెప్పారు.
-
ఆ ఇద్దరి రాకతో జాగ్రత్త పడ్డ ఇరాన్- అనుకున్నదంతా అయింది -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications