100 రోజుల ఛాలెంజ్: మహమ్మారి నిర్మూలనకు బిడెన్ చెప్పిన చిట్కా: కొత్త టాస్క్
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి అధ్యక్షుడు జో బిడెన్ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. వందరోజుల పాటు మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నన్ని రోజులు మాస్కులను ధరించనక్కర్లేదని ఆయన తేల్చి చెప్పారు. వంద రోజులు మాత్రమే వాటిని ధరించాల్సి ఉంటుందని సూచించారు. కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
Recommended Video
మాస్కులను ధరించడం దేశభక్తితో సమానమని ఆయన పునరుద్ఘాటించారు. అమెరికన్లకు దేశం పట్ల ఉన్న భక్తిని చాటుకోవడానికి ఇదొక మంచి అవకాశమని, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని చెప్పారు. జీవితకాలం పాటు మాస్కులను ధరించాలని తాను చెప్పట్లేదని, వంద రోజులు చాలని వివరించారు. వంద రోజుల పాటు ప్రతి అమెరికన్ కూడా తప్పనిసరిగా మాస్కులను ధరించడం వల్ల రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గిపోతాయని జో బిడెన్ పేర్కొన్నారు.

ఈ చిట్కాను పాటించడం వల్ల ప్రతి అమెరికన్ కనీసం 50 వేల ప్రాణాలను కాపాడవచ్చని బిడెన్ అన్నారు. మాస్కులను ధరించడం వల్ల కరోనా నియంత్రణలోకి వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారని, అందుకే ఈ నిబంధనను అమల్లోకి తీసుకుని రావాల్సి వచ్చిందని అన్నారు. ఏప్రిల్ వరకు మాస్కులను దరించడం వల్ల దాని ప్రభావం ఎలా ఉంటుందో.. కరోనా రోజువారీ పాజిటివ్ కేసుల్లో ఎలాంటి క్షీణత కనిపిస్తుందో అందరకీ అర్థమౌతుందని అన్నారు.
నిజానికి- అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే జో బిడెన్ జారీ చేసిన 15 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ఇదీ ఒకటి. వంద రోజుల పాటు మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేయడానికి ఉద్దేశించిన ఆర్డర్‌పై ఆయన తొలి రోజే సంతకం చేశారు. దీనిపై ప్రజల నుంచి పెద్దగా స్పందన లభించట్లేదు. దీనితో ఆయన మరోసారి అమెరికన్లకు మాస్కుల ధారణ ప్రాధాన్యతను వివరించారు. ఏప్రిల్ వరకు ధరిస్తే చాలని సూచించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications