బైడెన్ విచక్షణాధికారం: కుమారుడికి క్షమాభిక్ష

US President Joe Biden: ఇంకొద్ది రోజుల్లో అమెరికాలో రిపబ్లికన్ల సారధ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్.. జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

ముగింపు దశ..

మరోవంక- ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పదవీకాలం ముగింపు దశకు వచ్చింది. దీనితో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. వాటికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తోన్నారు. ఇటీవలే ఉక్రెయిన్‌కు బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ఆర్డర్‌ను ఆమోదించారు.

US President Joe Biden signed a pardon for his son Hunter Biden including tax convictions

తనయుడికి క్షమాభిక్ష..

తన తనయుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్షను ప్రసాదించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తాజాగా సంతకం చేశారు. ఈ విషయంలో తన విచక్షణాధికారాన్ని ప్రయోగించారు. హంటర్ బైడెన్‌పై వివిధ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసులన్నింటినీ మాఫీ చేశారు. ఆయా కేసులన్నీ కూడా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనంటూ వ్యాఖ్యానించారు.

పన్ను ఎగవేత కేసులు

హంటర్.. పన్ను ఎగవేత కేసులను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో తన నేరాన్ని సైతం అంగీకరించారు. న్యాయస్థానం ముందు లొంగిపోయారు. పన్ను ఎగవేత, రిటర్న్‌లను సక్రమంగా దాఖలు చేయకపోవడం, గన్ క్రైమ్ వంటి తొమ్మిది కేసుల్లో తనపై వచ్చిన నేరాలన్నింటినీ అంగీకరిస్తూ కొద్దిరోజుల కిందటే కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

1.4 మిలియన్ డాలర్ల మేర పన్ను..

2016-19 మధ్యకాలంలో 1.4 మిలియన్ డాలర్ల మేర పన్నును ఎగ్గొట్టిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు హంటర్ బైడెన్. దీనికి సంబంధించిన తప్పుడు డాక్యమెంట్లను సమర్పించినట్లు విచారణలో తేలింది. ఆ ఆరోపణలను హంటర్ బైడెన్ గతంలో తోసిపుచ్చారు. తాను సక్రమంగా పన్ను చెల్లించానని, ఐటీ రిటర్న్ప్‌లను ఎప్పటికప్పుడు దాఖలు చేస్తూ వచ్చానంటూ వివరణ ఇస్తూ వచ్చారు.

నేరాంగీకరణ..

ఈ ఆర్థిక నేరాలపై లాస్ ఏంజిలిస్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ ఏడాది జూన్‌లో కేసు ఫైల్ అయింది. మొత్తం తొమ్మిది పిటీషన్లు దాఖలయ్యాయి. జడ్జి మార్క్ సీ స్కార్సీ బెంచ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. 56 పేజీల తొలి పిటీషన్‌ను చదవటం పూర్తయిన వెంటనే.. హంటర్ బైడెన్ తరఫు అడ్వొకేట్ అబ్బే లోవెల్..నేరాంగీకరణ పిటీషన్‌ సమర్పించారు అప్పట్లో.

అమెరికా చట్టాల ప్రకారం..

నేరాలను అంగీకరించిన నేపథ్యంలో- ఐటీ రిటర్న్స్ దాఖలు విషయంలో తాను ఎలాంటి పొరపాట్లూ చేయలేదంటూ 2023లో కోర్టుకు సమర్పించిన రిపోర్టు ఇక చెల్లదంటూ కోర్టు పేర్కొంది. అమెరికా చట్టాల ప్రకారం.. పన్ను ఎగవేత కేసుల్లో హంటర్ బైడెన్‌కు 17 సంవత్సరాలు, గన్ క్రైమ్ కేసులో మరో 25 ఏళ్ల పాటు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అలాగే మిలియన్ డాలర్ల జరిమానాను ఎదుర్కోవచ్చు.

ఆయా కేసులన్నింటినీ కూడా మాఫీ

ఈ పరిస్థితుల మధ్య జో బైడెన్ ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయా కేసులన్నింటినీ కూడా మాఫీ చేసినట్టయింది. ఈ మేరకు అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. క్షమాభిక్ష పెట్టడానికి గల కారణాలను వివరించింది.

నిజం తెలియాల్సిన అవసరం

అమెరికన్లకు నిజం తెలియాల్సిన అవసరం ఉందని, వాళ్లు నిష్పక్షపాతంగా ఉంటారని బైడెన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తాను న్యాయ వ్యవస్థను విశ్వసిస్తానని, ఇప్పుడు వాటితో ఘర్షణ పడదలచుకోలేదని పేర్కొన్నారు. ఈ కేసు- రాజకీయంగా ప్రేరేమితమైనట్లు, దేశ చట్టాలు, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగుతున్నట్లు భావిస్తున్నానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+