అధ్యక్షా.. ఇదేంది, విమానం ఎక్కేసమయంలో తుళ్లిపడిన బిడైన్, 3 సార్లు..
అమెరికా వృద్ధ అధ్యక్షుడు జో బిడైన్.. ఆయనకు 78 ఏళ్లు అనే సంగతి తెలిసిందే. అయితే ఆయన శుక్రవారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో అట్లాంటా బయల్దేరే సమయంలో తుళ్లిపడిపోయారు. విమానం ఎక్కే సమయంలో మూడుసార్లు పడిపోయారు. ఆ వెంటనే లేచారు. పక్కన గల వీల్ పట్టుకొని ఎలాగోలా పైకి ఎక్కేశారు. ఆ తర్వాత అందరికీ అభివాదం చేశారు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
శుక్రవారం అట్లాంటాకు అధ్యక్షుడు బిడైన్ బయల్దేరారు. అక్కడ ఆసియన్ అమెరికన్ నేతలతో సమావేశం కానున్నారు. పార్లర్ వద్ద మాస్ ఫైరింగ్ జరగడంతో బయల్దేరారు. అయితే ఆ సమయంలో తూళ్లిపడిపోయారు. మూడుసార్లు పడిపోయి.. వెంటనే లేచారు. తర్వాత రెయిలింగ్ పట్టుకొని ఎలాగొలా పైకి లేచారు. వాతావరణం సరిగా లేని సమయంలో.. ఇబ్బంది పడుతూ లేచారు.

పడి లేచిన బిడైన్ ఆరోగ్యం బాగుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపింది. బిడైన ఆరోగ్యం 100కు వందశాతం బాగుందని వివరించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో బిడైన్ ఆరోగ్యం గురించి రకరకాల ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఇలా జరగడం చర్చకు దారితీసింది. నవంబర్‌లో తన కుక్కతో ఆడుకునే సమయంలో బిడైన్ గాయపడిన సంగతి తెలిసిందే.
The Empire is Broken?https://t.co/kAKhHpaBEG
— ivan (@ivan8848) March 20, 2021












Click it and Unblock the Notifications