అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. కలకలం
US Presidential elections 2024: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. ఈ ఏడాది చివర్లో ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. షెడ్యూల్ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. జనవరి 20వ తేదీన ఆ దేశ కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.
2019 నాటి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. అధ్యక్షుడిగా, భారత సంతతికి చెందిన కమల హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పుడు మళ్లీ బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో నిలిచారు. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని ఇంకా ఖరారు చేయలేదు డెమోక్రాట్లు.

రిపబ్లికన్ల తరఫున కూడా అభ్యర్థి మారలేదు. 2019 నాటి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనెటర్ జేమ్స్ డేవిడ్ వెన్స్ పేరు ఖరారైంది. ఈ రెండు పార్టీలు కూడా విస్తృతంగా ఎన్నికల ర్యాలీలను నిర్వహిస్తోన్నాయి.
తాజాగా ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి డెలావర్ వెళ్లిన అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా వైరస్ బారిన పడ్డారు.ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలారు. దీనితో డెలావర్‌లో ఆయన ఐసొలేషన్‌లో వెళ్లారు. క్వారంటైన్‌లో ఉంటోన్నారు. వాషింగ్టన్‌లోని తన అధికారిక నివాసం వైట్‌హౌస్ నుంచి డెలావర్‌కు చేరుకున్న కొద్దిసేపటికే అనారోగ్యానికి గురయ్యారు.
నెవాడాలోని హ్యారీ రీడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన కొద్దిసేపటికే బైడెన్‌లో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. దీనితో ఆయనకు టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరిన్ జీన్ పియర్రె తెలిపారు.
President Biden is vaccinated, boosted, and he is experiencing mild symptoms following a positive COVID-19 test.
— The White House (@WhiteHouse) July 17, 2024
He will be returning to Delaware where he will self-isolate and will continue to carry out all of his duties fully during that time.
A note from @POTUS' Doctor:…
కోవిడ్ సమయంలోనే బైడెన్ రెండు డోసుల వ్యాక్సిన్, బూస్టర్ తీసుకున్నారని గుర్తు చేశారు. ఐసొలేషన్‌లో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటారని వివరించారు. బైడెన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, త్వరలోనే రోజువారి విధులకు హాజరవుతారని వయాఖ్యానించారు.
ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో రోజువారీ కరోన వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోండటం ఆందోళనకరంగా పరిణమించింది. ప్రత్యేకించి- కాలిఫోర్నియా, అర్కాన్సస్, ఫ్లోరిడా, మేరీల్యాండ్, నెవాడా, ఒరెగాన్, టెక్సాస్‌లల్లో దీని తీవ్రత అధికంగా ఉంటోంది. కిందటి నెల 26వ తేదీన 215 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మంగళవారం నాటికి ఈ సంఖ్య 307కు చేరింది.












Click it and Unblock the Notifications