అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు 2024: తొలి ఫలితం వచ్చేసింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మంగళవారం (నవంబర్ 5) పోలింగ్ మొదలైన కొద్ది గంటలకే ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్ కూడా పూర్తయి ఫలితం వచ్చేసింది. న్యూహ్యాంప్ షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌ (Dixville Notch)లో తొలి ఫలితం వెలువడింది. అక్కడ మొత్తం కేవలం ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉండటం గమనార్హం.

ఈ ఆరు ఓట్లలో డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris)కు మూడు ఓట్లు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు మూడు ఓట్లు వచ్చాయి. కాగా, 2020లో మాత్రం డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ వైపు డిక్స్‌విల్లే నాచ్‌ ఓటర్లు మొగ్గుచూపారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయనే విజయం సాధించడం విశేషం. కానీ, ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులకు సమానం ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది.

US Presidential Election 2024 First results are in

కాగా, అమెరికా-కెనడా సరిహద్దులో ఉన్న ప్రదేశమే డిక్స్‌విల్లే నాచ్‌. ఇక్కడ ప్రస్తుతం ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. నలుగురు రిపబ్లికన్ పార్టీ తరపున నమోదు చేసుకున్నవారు కాగా, మరో ఇద్దరు ఏ పార్టీ తరపున నమోదు చేసుకోలేదు. ఎన్నికల రోజు మొదలైన తర్వాత వీరంతా స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద జాతీయ గీతాన్ని ఆలపించి, ఆ తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వీరు ఓటేసిన 15 నిమిషాల తర్వాత ఫలితాలు ప్రకటించారు. 1960 నుంచి అర్ధరాత్రి ఓటు హక్కు వినియోగించుకునే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశంలోనే తొలి ఫలితం వచ్చే ప్రదేశంగా డిక్స్‌విల్లే ‌నాచ్ రికార్డుల్లోకెక్కింది. కాగా, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఓటర్లు భారీ ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు కూడా ప్రకటించడం జరుగుతుంది.

US Presidential Election 2024 First results are in
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+