21వ శతాబ్దంలో అత్యుత్తమ అధ్యక్షుడిగా ట్రంప్‌

Vivek Ramaswamy: ఈ ఏడాది.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల పోలింగ్‌ను డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉందక్కడ. జో బైడెన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం ముగియడానికి ఇంకో ఏడాది మాత్రమే మిగిలివుంది.

ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ.. ఎన్నికల కోసం సన్నాహాలు చేపట్టింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకుంది. ఆయనపై పలు నేరారోపణలు, కేసులు ఉన్నప్పటికీ.. ట్రంప్‌పైనే విశ్వాసం ఉంచింది. 2019 నాటి ఎన్నికల్లో ఓడినప్పటికీ.. మళ్లీ ట్రంప్ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

US Presidential election 2024: Vivek Ramaswamy drops out

అభ్యర్థిని ఎంచుకోవడానికి అయోవా స్టేట్‌లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్- 21.4, నిక్కీ హేలీ-17.7, వివేక్ రామస్వామి- 7.2 శాతం ఓట్లు పడ్డాయి. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ భారత సంతతికి చెందినవారే.

అభ్యర్థిత్వం ఖరారు కావడానికి 1,215 ఓట్లు అవసరం కాగా.. డొనాల్డ్ ట్రంప్‌కు తొలి రౌండ్‌లోనే 2,035 మేర ఓట్లు పోల్ అయ్యాయి. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోండటం వల్ల ఆయన ఆధిక్యత మరింత పెరిగే అవకాశం ఉంది. రాన్ డీశాంటీస్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 824 ఓట్లు వచ్చాయి. నిక్కీ హేలీ-682, వివేక్ రామస్వామి- 278 ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు.

US Presidential election 2024: Vivek Ramaswamy drops out

ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకొంటోన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని లిఖితపూరకంగా తెలియజేశారు.

అనంతరం డొనాల్డ్ ట్రంప్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తోన్నట్లు ప్రకటించారు వివేక్ రామస్వామి. ఆయన విజయం కోసం క్యాంపెయిన్‌ చేస్తానని, ఎన్నిలక టీమ్‌లో సభ్యుడిగా ఉంటానని వెల్లడించారు. అమెరికా ఫస్ట్ అనే అజెండాను మళ్లీ తెర మీదికి తీసుకొస్తామని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‌ను 21వ శతాబ్దంలోనే అత్యుత్తమ అధ్యక్షుడిగా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+