స్వింగ్ స్టేట్స్‌లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరీనే!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్నాయి. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు రెండు రోజులే గడువు ఉండటంతో పోలింగ్ సరళిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ముందస్తు ఓటింగ్ ద్వారా పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో కీలకమైన స్వింగ్ స్టేట్స్‌లో వీరిద్దరి మధ్య పోటాపోటీ నెలకున్నట్లు తాజా ఓపీనియన్ పోల్స్ పేర్కొనడం గమనార్హం.
నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్‌లు కమలా హారిస్ వైపు మొగ్గు చూపుతుండగా.. అరిజోనాలో డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు లభిస్తున్నట్లు తెలిసింది. మిషిగన్, జార్జియా, పెన్సిల్వేనియాల్లో మాత్రం ఇద్దరు నేతల మధ్య తవ్ర పోటీ నెలకొంది. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 2 వరకు ఈ కీలక రాష్ట్రాల్లో ది న్యూయార్క్ టైమ్స్ ైనా పోల్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

అమెరికా అధ్యక్ష బరిలో ముఖ్యంగా రిపబ్లికన్, డెమోక్రటిక్ అభ్యర్థులతోపాటు అనేక మంది స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు. రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్, కార్నెల్ వెస్ట్ లు స్వతంత్రులుగా బరిలో దిగారు. ఇక, గ్రీన్ పార్టీ నుంచి జిల్ స్టీన్, లిబర్టేరియన్ పార్టీ నుంచి చేజ్ ఓలివర్ పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ మధ్యే కొనసాగుతోంది.
అమెరికాలో దాదాపు 24.4 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే 7.5 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారారు. అయితే, ప్రవాస భారతీయులు కూడా ఒకరివైపు ఉండకుండా.. కొంత మంది డొనాల్డ్ ట్రంప్ వైపు, మరికొంత మంది కమలా హారిస్ కు మద్దతుగా నిలుస్తుండటం గమనార్హం. ప్రవాస భారతీయులు, అమెరికన్ ఇండియన్స్ ఓట్ కోసం ట్రంప్, కమలా హరిస్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఎక్కువ మంది భారతీయులు ఎవరివైపు మొగ్గుచూపుతారనేది ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications