ఏఆర్ రెహ్మాన్ కీలక నిర్ణయం.. !!
Donald Trump-Kamala Harris debate 2024: గడువు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.
ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీలో ఉండటం వరుసగా ఇది మూడోసారి.

ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్‌కు తన మద్దతును ప్రకటించారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం- కమలా హ్యారిస్ మూలాలు తమిళనాడులో ఉండటం ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఆమె తల్లి శ్యామల గోపాలన్ హ్యారిస్ స్వరాష్ట్రం తమిళనాడే.
ఈ నేపథ్యంలో కమలా హ్యారిస్‌కు మద్దతుగా లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌ను నిర్వహించనున్నాడు రెహ్మాన్. ఫండ్ రైజింగ్‌లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. ఆసియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ (ఆపి) దీన్ని నిర్వహించనుంది. ఈ మ్యూజికల్ కన్సర్ట్.. ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం.. ఈ ఆదివారం రాత్రి 8 గంటలకు ఆపి అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఏఆర్ రెహ్మాన్ వంటి జగమెరిగిన సెలెబ్రిటీ కమలా హ్యారిస్‌కు మద్దతు ప్రకటించడం వల్ల ఈ ఎన్నికల్లో ఆమె విజయావకాశాలు మరింత మెరుగుపడాయని ఆపి అభిప్రాయపడింది. అమెరికాలో నివసించే ఆసియా దేశస్తులు కమలా హ్యారిస్- టిమ్ వాల్ట్జ్ జోడీని అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటామని పేర్కొంది.
అమెరికాలో స్థిరపడిన ఇతర దేశస్తులు- ప్రత్యేకించి ఆసియా దేశాలకు చెందిన వారు స్వేచ్ఛగా, సురక్షితంగా నివసించగల వాతావరణం ఒక్క డెమోక్రటిక్ పార్టీ వల్లే సాధ్యపడుతుందని ఆపి వ్యాఖ్యానించింది. గతంలో అనేక సందర్భాల్లో ఇది రుజువైందని, కమలా హ్యారిస్- టిమ్ వాల్ట్జ్ పాలన కూడా అలాగే ఉంటుందని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications