ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమాఖ్య నుంచి వైదొలిగిన అమెరికా
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమాఖ్య నుంచి అమెరికా వైదులుగుతున్నట్లు ఐక్యరాజ్యసమితికి అమెరికా దౌత్యవేత్తగా ఉన్న నిక్కీ హేలీ ప్రకటించారు. మానవహక్కుల సమాఖ్య పేరుకు తగినట్లుగా వ్యవహరించడంలేదని ఆమె ఆరోపించారు. ఇజ్రాయిల్ దేశం పట్ల ఐక్యరాజ్య సమితి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకుందన్నారు. అంతేకాదు మానవహక్కులను ఉల్లంఘిస్తున్న చైనా, క్యూబా, వెనెజులా, కాంగోలాంటి దేశాలు సమాఖ్యలో సభ్యులుగా ఉండటాన్ని కూడా ఆమె తప్పుబట్టారు.
ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సమాఖ్యనుంచి వైదొలగడం కఠిన నిర్ణయమే అయినప్పటికీ తమకున్న విలువల ఆధారంగా బయటికి రాక తప్పడం లేదని నిక్కీ అన్నారు. మానవహక్కులను ఎగతాళి చేయలేమని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సమాఖ్యకు గొప్ప విజన్ ఉండేదని ఇప్పుడది కొరవడిందని అన్నారు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపో. ప్రస్తుతం ఉన్న సమాఖ్య మానవహక్కులను పరిరక్షించడంలో విఫలమైందని మైక్ అభిప్రాయపడ్డారు.

ఓవైపు సమాఖ్య నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తూనే తమ నిర్ణయం శాశ్వతమైనది కాదని నిక్కీ చెప్పుకొచ్చారు. మానవహక్కుల సమాఖ్య సంస్కరణలు తీసుకొస్తే అమెరికా తిరిగి సమాఖ్యలో కొనసాగుతుందని చెప్పారు. సమాఖ్య నుంచి వైదొలగినప్పటికీ... ఐక్యరాజ్యసమితి మానవహక్కులను పరిరక్షించేందుకు అమెరికా కృషి చేస్తుందని నిక్కీ స్పష్టం చేశారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications