దమ్ముంటే ఇజ్రాయెల్ ప్రధానిని కిడ్నాప్ చెయ్ చూద్దాం: ట్రంప్ కు పాకిస్తాన్ సవాల్

ఇజ్రాయెల్ పై పాకిస్తాన్ మరోసారి నిప్పులు చెరిగింది. గాజా, లెబనాన్ లల్లో హమాస్, హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ లను మట్టుబెట్టుతూ వస్తోన్న నేపథ్యంలో తన వైఖరిని మరోసారి బయటపెట్టుకుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఘాటు విమర్శలు చేసింది. ఆయనను అంతర్జాతీయ స్థాయి క్రిమినల్ గా అభివర్ణించింది. ఆయనను మించిన క్రిమినల్ మరొకరు లేరని ఆరోపించింది. మానవత్వానికి అతిపెద్ద నేరస్థుడిగా పేర్కొంది.

పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మానవత్వంపై నమ్మకం ఉంటే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఎత్తుకెళ్లినట్టే నెతన్యాహును అమెరికా కిడ్నాప్ చేయాలని ఆయన డొనాల్డ్ ట్రంప్ కు సవాల్ విసిరారు. నెతన్యాహును అపహరించుకుని తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు టర్కీకి కూడా ఉన్నాయని అన్నారు. ఇటువంటి సందర్భం కోసం పాకిస్తానీలు రోజూ ప్రార్థనలు చేస్తోన్నారని ఆసిఫ్ అన్నారు.

US Should Kidnap Netanyahu claim by Pakistan Minister Draws International Attention

ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడారు. గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సాగించిన దాడుల గురించి ప్రస్తావించారు. గాజాలో పాలస్తీనియన్లపై జరిగిన క్రూరత్వాలు చరిత్రలో మరే ఘోరానికీ సాటిరాబోవని స్పష్టం చేశారు. గాజా సుదీర్ఘ చరిత్రలో పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ చేసిన అన్యాయం ఏ సమాజమూ చేయలేదని వ్యాఖ్యానించారు. నెతన్యాహు మానవత్వానికి అతిపెద్ద నేరస్తుడని, ప్రపంచం ఇంతకంటే పెద్ద క్రిమినల్ ను చూడలేదని అన్నారు.

నేరస్తులకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకోవాలని ఖవాజా ఆసిఫ్ పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఆ న్యూస్ ఛానల్ యాంకర్ హమీద్ మీర్ కల్పించుకున్నారు. ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి చేసిన పరోక్ష సూచనగా కనిపించే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా ట్రంప్ ను ఉద్దేశించినవి కాదని ఓ వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+