కిమ్‌కి షాకిచ్చిన అమెరికా, ద. కొరియా: సంచలనంగా నేవీ డ్రిల్

Subscribe to Oneindia Telugu
    US

    సియోల్‌: వరుస క్షిపణి ప్రయోగాలతో యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియాకు దక్షిణ కొరియాతో కలిసి అమెరికా దిమ్మదిరిగే షాకిచ్చింది. తాజాగా ఈ రెండు దేశాలు చేస్తున్న యుద్ధ విన్యాసాలతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హడలెత్తిపోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.

     సంచలనంగా నేవీ డ్రిల్

    సంచలనంగా నేవీ డ్రిల్

    వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే అనేక సార్లు కొరియా ద్వీపంపై యుద్ధ విమానాలతో డ్రిల్‌ చేపట్టి తమ సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించింది అమెరికా. తాజాగా దక్షిణకొరియాతో కలిసి చేపట్టిన నేవీ డ్రిల్‌ సంచలనంగా మారింది.

    అనేక నేవీ దళాలు

    అనేక నేవీ దళాలు

    దక్షిణకొరియా తూర్పు తీరంలో ఆ దేశంతో కలిసి అమెరికా సంయుక్త నావికాదళ విన్యాసాలు చేపట్టింది. యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రేగాన్‌, దియోడోర్‌ రూస్‌వెల్ట్‌, నిమిజ్‌ బ్యాటిల్‌ గ్రూప్‌లు విజయవంతంగా సముద్ర జలాల్లోకి వెళ్లినట్లు దక్షిణకొరియా మిలిటరీ తెలిపింది.

     ట్రంప్ పర్యటన నేపథ్యంలో..

    ట్రంప్ పర్యటన నేపథ్యంలో..

    శనివారం నుంచి నుంచి నాలుగు రోజులపాటు ఈ డ్రిల్‌ జరుగుతుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసియాలో పర్యటిస్తున్న సమయంలో ఈ డ్రిల్‌ చేపట్టడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

    చైనా సాక్షిగా! మోడీపై ట్రంప్ ప్రశంసల వర్షం, ఏమన్నారంటే..?

     చైనా మాత్రం..

    చైనా మాత్రం..

    కాగా, గత ఆదివారం నుంచి ట్రంప్‌ ఆసియా దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే మొదట జపాన్‌, దక్షిణకొరియాల్లో పర్యటించిన ట్రంప్.. తాజాగా చైనాలో కూడా పర్యటించారు. ట్రంప్ కు చైనా ఘన స్వాగతం పలికింది. అయితే, జపాన్, దక్షిణకొరియాలు ఉత్తరకొరియా విషయంలో అమెరికాకు మద్దతు పలుకగా, చైనా మాత్రం ఏ విషయం తేల్చకపోవడం గమనార్హం.

    భయపడేది లేదు! మొత్తం సైనిక శక్తి దించుతాం: ఉ.కొరియాకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక

    ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

    English summary
    The United States and South Korea started joint naval exercises Saturday that will involve three U.S. aircraft carriers in what military officials describe as a clear warning to North Korea.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి