తుపాకీతో కాల్చుకుని మూడేళ్ల చిన్నారి మృతి

న్యూయార్క్: ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మూడేళ్ల చిన్నారి మృతిచెందాడు. ఈ ఘటన అమెరికాలోని హామిల్టన్‌ కౌంటీ సిన్సినాటి నగరంలో చోటుచేసుకుంది. ఓహియోలోని తన ఇంట్లో తుపాకీ పేలిన శబ్ధం వినిపించడంతో బాలుడి తల్లి వెంటనే అక్కడికి వచ్చింది.

అప్పటికే చిన్నారి మృతి చెంది ఉన్నాడు. కాగా, తుపాకీ తనదేనని.. బ్యాగులో పెట్టానని బాలుడి తల్లి ఎలిజెబెత్‌ చెప్పింది. బ్యాగు కింద ఉండటంతో తన కొడుకు తుపాకీ బయటకు తీసి ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు ఛాతీలోకి పేల్చుకున్నాడని పోలీసులకు తెలిపింది.

US toddler kills himself with mother's gun

మృతి చెందిన బాలుడ్ని మార్కీస్ గ్రీన్‌గా గుర్తించిన పోలీసులు, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓహియో ప్రాంతంలో ఇలా ఓ చిన్నారి కాల్చుకుని చనిపోవడం ఇది రెండోదని పోలీసులు చెప్పారు.

అమెరికాలో ప్రతీ ఏడాది సుమారు 100మంది చిన్నారులు ప్రమాదవశాత్తు ఈ విధంగా తుపాకీతో కాల్చుకుని చనిపోతున్నారని ఓ నివేదిక తెలిపింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు తుపాకులను దూరంగా ఉంచాలని పోలీసులు సూచించినప్పటికీ.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+